ప్రపంచంలోని అతిపెద్ద జలపాతాలలో ఒకటైన నయాగరా జలపాతం కారణంగా గడ్డకట్టింది. పోలార్ వోర్టెక్స్ వద్ద ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ దిగువకు పడిపోవడంతో నయాగరాజలపాతం ఫ్రీజ్ మోడ్‌లోకి జారిపోయింది. దీంతో టూరిస్టులు, స్థానికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
గడ్డకట్టిన నయాగరా జలపాతానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రెయిలింగ్‌లు, నదీ తీరాలకు అతుక్కుపోయిన మందంగా మంచు పేరుకుపోయినప్పటికీ జలపాతాల హోరు మాత్రం ఆగలేదు.
నయాగరా జలపాతం గడ్డకట్టి, అద్భుతమైన దృశ్యాలతో అలరారుతోంది. నయాగరా నది అంచుల దగ్గర పాక్షికంగా గడ్డకట్టినట్లు కనిపిస్తుంది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ లక్షలాది లీటర్ల నీరు జలపాతంపై ప్రవహిస్తుంది.ప్రతి సెకనుకు లక్షలాది లీటర్ల నీరు అంచుల నుండి ఉరుములు మెరుపులతో ఉప్పొంగుతూనే ఉంది. శీతలగాలులు, పొగమంచుకి విరుద్ధంగా, ప్రవహించే నీరు, ఘనీభవించిన ఉపరితలాలు పక్కపక్కనే వీడియోలు నెట్టింట సందడిగామారాయి.
సాధారణంగా, శీతాకాలంలో కూడా జలపాతం నుండి వచ్చే పొగమంచు కొద్దిసేపు ద్రవంగా ఉంటుంది. అయితే సూపర్-కూల్డ్ గాలి పొగమంచులోని నీటి బిందువులు చల్లని ఉపరితలాలను తాకిన క్షణంలో సంభిస్తోంది. గంటలు ,రోజులలో, మంచు నెమ్మదిగా రాళ్ళు, చెట్లు, నడక మార్గాలు , పరిశీలనా కేంద్రాల వెంట మందపాటి క్రస్ట్‌లు, శిల్పకళా కళాకృతులు దర్శనిమిచ్చాయి. ఫలితంగా అరుదైన దృశ్య విరుద్ధంగా కనిపిస్తుంది.కింద గర్జించే నీరు, పైన నిశ్శబ్దంగా, గడ్డకట్టిన ప్రపంచం.ఈ వింటర్ వండర్‌ను చూసి నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్థానికులు , సందర్శకులు ఈ దృశ్యాన్ని "మరోప్రపంచం"గా అభివర్ణించారు.
❄️| Extreme cold freezes the iconic Niagara Falls.
pic.twitter.com/oyCw7mlTCe— Earth (@earthcurated) January 26, 2026
నయాగరా జలపాతం ఎప్పుడూ ఘనీభవించదు, ఆర్కిటిక్ గాలులు, విపరీతమైన చలి ఈ ప్రభావాన్ని పెంచుతుంది. శక్తివంతమైన పోలార్ వెర్టిక్స్ చుట్టు పక్కల ప్రాంతాలపై తక్షణమే మంచు వేగంగా పేరుకు పోయేలా చేస్తుంది. దీంతో ఈ దృశ్యం ఫోటోగ్రాఫర్లు , వింటర్ టూరిస్టులను కనివిందు చేస్తోంది.



