పాకిస్థాన్‌లో విపరీతమైన పబ్లిసిటీ ఉన్న మంత్రిగా రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్‌కు ఓ పేరుంది. ఏది పడితే ఆ ఈవెంట్‌కు హాజరవుతూ నిత్యం వార్తల్లో.. సోషల్ మీడియాలో కనిపిస్తూ.. విమర్శలు ఎదుర్కొంటారాయన. ఈ క్రమంలో.. ఆ పబ్లిసిటీ పిచ్చి ఆయన పరువు తీసేసింది.
పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ తాజాగా సియాల్‌కోట్‌లో పిజ్జా హట్ అవుట్‌లెట్‌ను ప్రారంభించారు. కొద్దిగంటలకే ఆ కార్యక్రమం ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇది షరా మామూలే కదా అనుకున్న నెటిజన్లకు.. కాసేపటికే ఓ పోస్ట్ విపరీతమైన నవ్వు తెప్పించింది.
పిజ్జా హట్ బ్రాండ్ సదరు అవుట్‌లెట్ గురించి ఒక ప్రకటన చేసింది. దాంతో తమకుగానీ.. యమ్ బ్రాండ్స్‌కుగానీ ఎలాంటి సంబంధం లేదని.. అది ఫేక్ ఔట్‌లెట్ అని క్లారిటీ ఇచ్చింది. ఈ షాపుపై సంబంధిత విభాగంలోనూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. దేనికి పడితే దానికి వెళ్తే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేస్తున్నారు.
Defence Minister Khawaja Asif just inaugurated a fake Pizza Hut outlet in Sialkot 😃 pic.twitter.com/sLPnQuBGqi
— Adeel Raja (@adeelraja) January 20, 2026


