breaking news
Khwaja Asif
-
తన పరువు తానే తీసుకుంటున్న పాక్!
‘‘మిత్రదేశాల్ని అప్పులు అడగాలంటే సిగ్గనిపిస్తోంది. అయినా తప్పడం లేదు. నేను, మన ఆర్మీ చీఫ్ ఇద్దరం జోలె పట్టుకుని వీలైనన్నీ ఎక్కువ దేశాలు తిరిగాం. ఇంకా తిరగడానికి కూడా వెనకాడబోం’’ అంటూ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మొన్నీమధ్యే బహిరంగంగా ఒక ప్రకటన చేయడం చూశాం. ఈ క్రమంలో సొంత దేశ పౌరులు తమ గురించి ఏం అనుకున్నా దులిపేసుకుంటాం అనే చందాన ఆయన మాట్లాడారు. ఈ లిస్ట్‌లో ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా అసిఫ్ చేరారు.అంతర్జాతీయ సమాజంలో పాక్ తన పరువు తానే తీసుకుంటోంది. మొన్నీమధ్యే అప్పుల గురించి ఆ దేశ ప్రధాని మాట్లాడిన విషయం తెలిసిందే కదా. ఆ తర్వాత ఆయన్ని పాక్ పౌరులు నెట్టింట తెగ ట్రోల్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వంతు వచ్చింది. జాతీయ అసెంబ్లీలో ఆయన.. బలూచ్ రెబల్స్‌ను ఎదుర్కోవడం తమ వల్ల కాదనే రీతిలో మాట్లాడడం గమనార్హం. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్‌లోనే అతిపెద్ద రీజియన్. ఇలాంటి చోట.. తక్కువ సంఖ్యలో దాగి ఉన్న బలూచ్ రెబల్స్‌ను ఎదుర్కోవడం మన(పాక్) సైన్యానికి పెద్ద సవాల్‌గా మారింది. పైగా బలూచ్ రెబల్స్ వద్ద ఆధునిక ఆయుధాలు ఉంటున్నాయి. రైఫిల్స్, నైట్ విజన్ పరికరాలు, థర్మల్ వెపన్ సైట్స్.. ఇలాంటివెన్నో వాళ్లు వాడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ కూడా ఎక్కువే. పాక్ సైన్యం కూడా మునుపెన్నడూ అలాంటి ఆయుధాల్ని చూసి ఉండదు.. అంటూ ప్రసంగించారాయన. ఈ క్రమంలో అమెరికానే వాటిని సమకూర్చి ఉంటుందని సంచలన ఆరోపణలకు దిగారు. ‘‘ఆ అత్యాధునిక ఆయుధాలు అమెరికన్‌వే. రెబల్స్ నాయకత్వం ఆఫ్గనిస్తాన్‌లో ఉండి.. అక్కడి నుంచి మద్దతు పొందుతున్నారు. బలూచిస్తాన్ విస్తీర్ణం పెద్దది కావడం.. రెబల్స్ ఆధునిక సాంకేతికత వాడటం వల్ల మన (పాక్) భద్రతా దళాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి’’ అని వ్యాఖ్యానించారాయన. అంతేకాదు.. బీఎల్ఏ లాంటి గ్రూపులు క్రిమినల్ గ్యాంగ్స్‌తో కలసి పనిచేస్తూ, ఆయిల్ స్మగ్లింగ్ ద్వారా నిధులను సమకూర్చుకుంటున్నాయి. సాధారణ పౌరులను, మహిళలను, పిల్లలను చంపే అలాంటి గ్రూపులతో పాక్ ప్రభుత్వం ఏనాడూ చర్చు జరపబోదు అని ఖ్వాజా జాతీయ అసెంబ్లీలో ప్రకటన చేశారు. సాధారణంగా ఒక దేశం తన భద్రతా లోపాలను, సైన్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులను బహిరంగంగా ఒప్పుకోవడం.. అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిష్టను దెబ్బతీసుకోవడమే. ఇప్పుడు రక్షణ మంత్రి ఖ్వాజా అదే పని చేశారని అక్కడి జనం తిట్టుకుంటున్నారు. సంపాదించేవారని ఆరోపించారు.ఇటీవల కాలంలో బలూచిస్తాన్‌లో బలూచిస్తాన్‌లో రెబల్స్ తిరుగుబాటు మళ్లీ తీవ్రరూపం దాల్చింది. పాక్ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని రెబల్స్ వైవిధ్యమైన దాడులకు తెగపడుతున్న సంగతి తెలిసిందే. మునుపెన్నడూలేని రీతిలో మహిళలతో పాక్ ఆర్మీపై బలూచ్ రెబల్స్ గ్రూపులు ఆత్మాహుతి దాడులు జరుపుతున్నాయి. గతవారం ఏకకాలంలో 12 చోట్ల దాడులు జరిపి 80 మంది ప్రాణాలు తీశాయి. అదే సమయంలో పాక్ ఆర్మీ ప్రతిఘటనతో.. ఇరువైపులా భారీగానే ప్రాణ నష్టం సంభవిస్తోంది. అయితే.. కిందటి ఏడాది.. బలూచిస్తాన్‌లో ప్రయాణికులతో వెళ్తున్న రైలును బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత అమెరికా ఆ గ్రూప్‌ను ఉగ్రసంస్థగా గుర్తిస్తూ.. ఆ రీజియన్‌లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా(KBK ప్రాంతాలను "Level 4: Do Not Travel" జాబితాలో చేర్చింది. అంటే అటువైపు ప్రయాణాలు అత్యంత ప్రమాదకరమైనవని చెప్పడమన్నమాట. ఒక్క బీఎల్ఏ మాత్రమే కాదు.. అక్కడి రెబల్స్ గ్రూపుల్లో చాలావాటిని అమెరికా ఉగ్రసంస్థగా ఈపాటికే గుర్తించింది కూడా. ఈ తరుణంలో.. అమెరికన్ అత్యాధునిక ఆయుధాలనే బలూచ్ రెబల్స్ ఉపయోగిస్తున్నారని ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారే అవకాశంగా కనిపించడమే కాదు.. అంతర్జాతీయంగానూ పాక్‌కు ఇబ్బందులు కలిగించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పబ్లిసిటీ పిచ్చి ఎంత పని చేసింది!
పాకిస్థాన్‌లో విపరీతమైన పబ్లిసిటీ ఉన్న మంత్రిగా రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్కు ఓ పేరుంది. ఏది పడితే ఆ ఈవెంట్‌కు హాజరవుతూ నిత్యం వార్తల్లో.. సోషల్ మీడియాలో కనిపిస్తూ.. విమర్శలు ఎదుర్కొంటారాయన. ఈ క్రమంలో.. ఆ పబ్లిసిటీ పిచ్చి ఆయన పరువు తీసేసింది.పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ తాజాగా సియాల్కోట్లో పిజ్జా హట్ అవుట్‌లెట్‌ను ప్రారంభించారు. కొద్దిగంటలకే ఆ కార్యక్రమం ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇది షరా మామూలే కదా అనుకున్న నెటిజన్లకు.. కాసేపటికే ఓ పోస్ట్ విపరీతమైన నవ్వు తెప్పించింది.పిజ్జా హట్ బ్రాండ్ సదరు అవుట్లెట్ గురించి ఒక ప్రకటన చేసింది. దాంతో తమకుగానీ.. యమ్ బ్రాండ్స్కుగానీ ఎలాంటి సంబంధం లేదని.. అది ఫేక్ ఔట్లెట్ అని క్లారిటీ ఇచ్చింది. ఈ షాపుపై సంబంధిత విభాగంలోనూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. దేనికి పడితే దానికి వెళ్తే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేస్తున్నారు.Defence Minister Khawaja Asif just inaugurated a fake Pizza Hut outlet in Sialkot 😃 pic.twitter.com/sLPnQuBGqi— Adeel Raja (@adeelraja) January 20, 2026 -
అమెరికా మిత్ర దేశం కాదు!
వాషింగ్టన్: అమెరికా ఇక తమకు ఎంతమాత్రం మిత్రదేశం కాదని పాకిస్తాన్ తేల్చిచెప్పింది. మిత్రదేశంగా వ్యవహరించాల్సిన తీరు ఇది కాదంటూ అగ్రరాజ్యాన్ని ఘాటుగా విమర్శించింది. ఉగ్ర స్థావరాల నిర్మూలనలో విఫలమైందంటూ పాక్‌కు అమెరికా సైనిక సాయం నిలిపివేసిన నేపథ్యంలో పాక్ స్పందించింది. ప్రముఖ దినపత్రిక ‘వాల్ స్ట్రీట్ జర్నల్’తో పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా అసిఫ్ మాట్లాడుతూ.. అమెరికాతో మైత్రి ముగింపు దశకు చేరుకుందన్నారు. ‘మా మధ్య ఎలాంటి సత్సంబంధాలు లేవు. మిత్ర దేశాలు ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదు’ అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలకు విరుద్ధంగా... అమెరికాతో స్నేహ సంబంధాలు కొనసాగుతాయని పాక్ విదేశాంగ కార్యదర్శి తెహ్మినా జంజువా పేర్కొనడం గమనార్హం. దక్షిణాసియాపై తీవ్ర ప్రభావం చూపగల అగ్రదేశం కావడంతో అమెరికాతో వీలైనంత వరకూ సత్సంబంధాలు కొనసాగించాలన్నదే పాకిస్తాన్ అభిమతమన్నారు. పాక్‌లోని ఉగ్ర స్థావరాల్ని నిర్మూలించేలా.. ఆ దేశాన్ని మిత్ర దేశమైన చైనా ఒప్పించగలదని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది. ఉగ్ర సంస్థలపై ఉక్కుపాదం మోపడం చైనా జాతీయ విధానమైందున.. ఆ దేశం స్పందించాలని వైట్‌హౌస్ అధికారి సూచించారు. పాక్ లో ఉగ్ర స్థావరాల ధ్వంసంతో దక్షిణాసియాలో సుస్థిరత సాధ్యమవుతుందన్నారు. -
పాకిస్తాన్ కు తీవ్ర ముప్పు!
ఇస్లామాబాద్: ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌తో తమ దేశానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. పాక్ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అతన్ని గృహనిర్బంధంలో ఉంచినట్లు తెలిపారు. జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ భద్రతా సదస్సులో ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. హఫీజ్‌కు ఉన్న ఉగ్రవాద సంబంధాలపై ఒక పాక్ నేత బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి. 2008 నవంబర్‌లో జరిగిన ముంబై ఉగ్రదాడుల అనంతరం సయీద్‌ను గృహనిర్బంధంలో ఉంచారు. అయితే 2009లో కోర్టు అతనికి విముక్తి కల్పించింది. వివిధ తీవ్రవాద కార్యకలాపాల్లో సయీద్ ప్రమేయాన్ని గుర్తించిన అమెరికా ప్రభుత్వం అతని తలపై రూ. 67 కోట్ల రివార్డు ప్రకటించింది. సదస్సులో తీవ్రవాదంపై జరిగిన చర్చలో ఆసిఫ్ మాట్లాడుతూ ‘తీవ్రవాదానికి ఏ మతంతోనూ సంబంధాలు లేవు, వారికి ఏ మతాన్నీ ఆపాదించొద్దు, వారు క్రిస్టియన్లు కాదు, ముస్లింలూ కాదు, బౌద్ధులు, హిందువులూ కాదు, వారు కేవలం తీవ్రవాదులు, నేరస్తులు’ అని పేర్కొన్నారు. ఈ నెల రోజుల్లో పాక్‌లో 8 తీవ్రవాద దాడులు జరిగాయని, కనీసం వందమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు తమ దేశం కృత నిశ్చయంతో ఉందన్నారు. సయీద్ ఆయుధ లైసెన్స్ రద్దు లాహోర్: జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌తో పాటు అతని అనుచరులకు జారీ చేసిన 44 ఆయుధ లైసెన్స్‌లను భద్రతా కారణాల రీత్యా రద్దు చేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. ఆయుధ లైసెన్స్‌లు రద్దు చేయడంతో సయీద్, అతని సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభమైనట్లు హోంశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సయాద్‌తో పాటు అతని సంస్థల్లోని మరో 37 మంది దేశం విడిచి వెళ్లకుండా పాక్ ప్రభుత్వం వారి పేర్లను ఎగ్జిట్ కంట్రోల్ జాబితాలో చేర్చింది.


