బంగారం, వెండి ధరల్లో ఊహకందని మార్పు! | Gold And Silver Rates This Week Review, Gold Prices Surge During The Week But Drop Over The Weekend, Silver Sees Sharp Decline | Sakshi
Sakshi News home page

బంగారం, వెండి ధరల్లో ఊహకందని మార్పు!

Feb 1 2026 9:07 AM | Updated on Feb 1 2026 10:20 AM

Gold and Silver Price in India From january 25th To 31st

భారతదేశంలో బంగారం ధరలు వారం ప్రారంభంలో భారీగా పెరిగి.. వారాంతంలో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి?, ఎంత తగ్గాయి?, ఎంత పెరిగాయనే.. విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

జనవరి 25న 1,60,260 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. జనవరి 31న 1,60,580 రూపాయల వద్దకు చేరింది. వారాంతంలో గోల్డ్ రేటు భారీ తగ్గినప్పటికీ.. సోమవారం నుంచి శనివారం వరకు రూ. 3,200 పెరిగినట్లు తెలుస్తోంది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. 1,46,900 రూపాయల నుంచి 1,47,200 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు రూ. 3,000 పెరిగింది.

చెన్నైలో సోమవారం (జనవరి 25) రూ. 1,59,490 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. శనివారం నాటికి రూ. 1,62,550 రూపాయల వద్దకు (3060 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,47,500 నుంచి రూ. 1,49,000లకు (రూ.1500 పెరిగింది) చేరింది.

ఇదీ చదవండి: పేలిన గోల్డ్ బబుల్.. లీ మాటలు నిజమవుతున్నాయా?

ఢిల్లీలో వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత పెరిగాయనే విషయానికి వస్తే.. జనవరి 25న 1,60,410 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం.. జనవరి 31 నాటికి 1,60,730 రూపాయల వద్దకు (3200 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల రేటు 1,47,050 రూపాయల నుంచి 1,47,350 రూపాయల వద్దకు (రూ.3000 పెరిగింది) చేరింది.

వెండి ధరలు
బంగారం ధరల మాదిరిగానే వెండి ధరల్లో కూడా భారీ మార్పులు జరిగాయి. జనవరి 25న రూ.3.65 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. జనవరి 31 నాటికి రూ. 3.20 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఈ లెక్కన కేజీ ధర 45000 రూపాయలు తగ్గిందన్న మాట.

Advertisement
 
Advertisement
Advertisement