సండే స్టాక్ మార్కెట్.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ | Stock Market Update At Sunday 2026 February 1st | Sakshi
Sakshi News home page

సండే స్టాక్ మార్కెట్.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

Feb 1 2026 9:38 AM | Updated on Feb 1 2026 11:20 AM

Stock Market Update At Sunday 2026 February 1st

సాధారణంగా ఆదివారం రోజు స్టాక్ మార్కెట్లకు సెలవు. అయితే యూనియన్ బడ్జెట్ 2026 కారణంగా.. ఈ రోజు (ఫిబ్రవరి 1) కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు యధావిధిగా కొనసాగుతున్నాయి.

దేశీయ స్టాక్ మార్కెట్లు ఆదివారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటలకు 290.58 పాయింట్ల నష్టంతో 82,275.79 వద్ద, నిఫ్టీ 117.45 పాయింట్ల నష్టంతో 25,301.45 వద్ద కొనసాగుతున్నాయి.

యునైటెడ్ ఫుడ్‌బ్రాండ్స్ లిమిటెడ్, సర్వోటెక్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్ లిమిటెడ్, రాజ్‌దర్శన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, IKIO టెక్నాలజీస్ లిమిటెడ్, ఫుజియామా పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్, ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.

Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Advertisement
 
Advertisement
Advertisement