కేంద్ర ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆదివారం(ఫిబ్రవరి 1న) స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ జరగనుంది. సాధారణ పనిదినాల మాదిరిగానే ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు మార్కెట్ పనిచేస్తుంది. ఎంసీఎక్స్‌లో ఉదయం 9నుంచి 5 గంటల వరకు మొదటి సెషన్‌లో ట్రేడింగ్ జరుగుతుంది.
సాధారణంగా స్టాక్ మార్కెట్లకు శనివారం, ఆదివారం సెలవు రోజులు. అయితే యూనియన్ బడ్జెట్ 2026ను ఆదివారం (ఫిబ్రవరి 1) ప్రవేశపెడుతున్నారు. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం అరుదైన ఘటన.. కాబట్టి ఆ రోజు స్టాక్ మార్కెట్ యధావిధిగా తెరిచే ఉంటుంది (స్టాక్ మార్కెట్‌కు ఆదివారం సెలవు లేదన్నమాట).


