శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 296.59 పాయింట్ల నష్టంతో 82,269.78 వద్ద, నిఫ్టీ 98.25 పాయింట్ల నష్టంతో 25,320.65 వద్ద నిలిచాయి.
పరాస్ పెట్రోఫిల్స్ లిమిటెడ్, రేమండ్ రియాల్టీ లిమిటెడ్, రేమండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్, భారత్ బిజ్లీ లిమిటెడ్, భారత్ రోడ్ నెట్‌వర్క్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, హిందూస్తాన్ జింక్ లిమిటెడ్, కోటక్ గోల్డ్ ఈటీఎఫ్, వేదాంత లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


