దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మునుపటి ముగింపుతో పోలిస్తే 34.88 పాయింట్లు పెరిగి 81,892.36 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 83.45 పాయింట్ల లాభంతో 25,258.85 వద్ద ప్రారంభమైంది.
భారత్-యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్టీఏ) ఖరారు చేయడంపై సానుకూల సెంటిమెంట్ మధ్య భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో పయనిస్తున్నాయి.
Today Nifty position 28-01-2026(time: 9:25 am)

నేటి క్యూ3 ఫలితాలు
లార్సెన్ & టూబ్రో, మారుతి సుజుకి ఇండియా, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, టివిఎస్ మోటార్, లోధా డెవలపర్స్, ఎస్బిఐ కార్డ్స్, జిఇ వెర్నోవా టిడి ఇండియా, ఫీనిక్స్ మిల్స్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్, మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, కొచ్చిన్ షిప్యార్డ్, గ్లాండ్ ఫార్మా, గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్, టివిఎస్ హోల్డింగ్స్, పైన్ ల్యాబ్స్, స్టార్ హెల్త్ & అలైడ్ ఇన్సూరెన్స్, పిరమల్ ఫార్మా, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ, ఇక్లెర్క్స్ సర్వీసెస్ తదితరాలు ఈ రోజు తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


