ఒక్కరోజే రూ.40,500 ర్యాలీ
రూ.3.7 లక్షలకు వెండి
రూ.1,66,000కు బంగారం
రూ.7,300 జంప్
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య బంగారం, వెండి ధరల్లో రికార్డులు కొనసాగుతున్నాయి. మంగళవారం ఈ రెండూ మరో కొత్త జీవిత కాల గరిష్టానికి దూసుకెళ్లాయి. బంగారం 10 గ్రాములకు రూ.7,300 లాభపడి రూ.1,66,000కు చేరుకుంది. గణతంత్రదినోత్స వం సందర్భంగా సోమవారం బులియన్ మార్కె ట్లు పనిచేయలేదు. వెండి కిలోకి రూ. 40,500 ఎగసి (12.3 శాతం) రూ.3,70,000 మార్క్‌ను తాకింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్‌కు 8.55 డాలర్లు పెరిగి (8.24%) 112.41 డాలర్లకు చేరింది. బంగారం 79 డాలర్లు ఎగసి (1.58%) 5,087.48 డాలర్ల మార్క్‌ను తాకింది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా నెలకొన్న డిమాండ్‌తో వెండి దేశీ మార్కెట్లో మరో కొత్త రికార్డు 3,70,000కు చేరినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. పెట్టుబడులకు తోడు పారిశ్రామిక డిమాండ్ సైతం వెండి ధరలకు తో డైనట్టు చెప్పారు. ‘‘సమీ ప కాలంలో లాభాల స్వీకర ణ, స్థిరీకరణకు అవకాశం ఉంది. కానీ, అంతర్జాతీయంగా రిస్క్ సా మర్థ్యం బలహీనంగా ఉన్నంత కాల ం, డాలర్ ఒత్తిళ్లు ఎదుర్కొన్నంత కా లం మొత్తం మీద వెండి ధరలకు సానుకూలమే’’అని లెమన్ మార్కెట్స్ డెస్క్ రీసెర్చ్ అనలిస్ట్ గౌరవ్ గార్గ్ తెలిపారు.


