ఫ్లైట్‌ ఎక్కుతున్నారా? అయితే ఈ రీచార్జ్‌ ప్లాన్స్‌ తెలుసుకోండి..

In flight recharge plans from Airtel Reliance Jio - Sakshi

ఈరోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌లు మనిషి జీవితంలో భాగమైపోయాయి. వీటిని వినియోగించకుండా నిమిషాలు కూడా ఉండలేని పరిస్థతి. విమాన ప్రయాణంలో సాధారణ రీచార్జ్‌ ప్లాన్‌లు పనిచేయవని మనందరికీ తెలుసు. ప్రత్యేక రీచార్జ్‌ ప్లాన్‌లు ఉంటేనే ఫ్లైట్‌లో ఉన్నంత సేపూ కాలింగ్‌ కానీ, ఇంటర్నెట్‌ కానీ వినియోగించుకునేందుకు వీలుంటుంది.

టెలికాం ఆపరేటర్లు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో  కొన్ని ఇన్-ఫ్లైట్ రీచార్జ్‌ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇవి ఫ్లైట్‌లో ఉన్నప్పుడు యూజర్‌లు కనెక్ట్ అయి ఉండేందుకు వీలు కల్పిస్తాయి. ఈ ప్లాన్‌లు డేటా, కాలింగ్, ఎస్‌ఎంఎస్‌ వంటి ప్రయోజనాలను అందిస్తాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ అందిస్తున్న ఇన్-ఫ్లైట్ ప్లాన్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

జియో రూ.195 ప్లాన్

 • డేటా: 250MB
 • కాలింగ్: 100 అవుట్‌గోయింగ్ కాలింగ్ నిమిషాలు
 • ఎస్‌ఎంఎస్‌: 100 అవుట్‌గోయింగ్ SMS
 • చెల్లుబాటు: 1 రోజు

జియో రూ. 295 ప్లాన్

 • డేటా: 500MB
 • కాలింగ్: 100 అవుట్‌గోయింగ్ కాలింగ్ నిమిషాలు
 • ఎస్‌ఎంఎస్‌: 100 అవుట్‌గోయింగ్ SMS
 • చెల్లుబాటు: 1 రోజు

జియో రూ. 595 ప్లాన్

 • డేటా: 1GB
 • కాలింగ్: 100 అవుట్‌గోయింగ్ కాలింగ్ నిమిషాలు
 • ఎస్‌ఎంఎస్‌: 100 అవుట్‌గోయింగ్ SMS
 • చెల్లుబాటు: 1 రోజు

ఎయిర్‌టెల్ రూ.195 ప్లాన్

 • డేటా: 250MB
 • కాలింగ్: 100 అవుట్‌గోయింగ్ కాలింగ్ నిమిషాలు
 • ఎస్‌ఎంఎస్‌: 100 అవుట్‌గోయింగ్ SMS
 • చెల్లుబాటు: 1 రోజు

ఎయిర్‌టెల్ రూ. 295 ప్లాన్

 • డేటా: 500MB
 • కాలింగ్: 100 అవుట్‌గోయింగ్ కాలింగ్ నిమిషాలు
 • ఎస్‌ఎంఎస్‌: 100 అవుట్‌గోయింగ్ SMS
 • చెల్లుబాటు: 1 రోజు

ఎయిర్‌టెల్ రూ. 595 ప్లాన్

 • డేటా: 1GB
 • కాలింగ్: 100 అవుట్‌గోయింగ్ కాలింగ్ నిమిషాలు
 • ఎస్‌ఎంఎస్‌: 100 అవుట్‌గోయింగ్ SMS
 • చెల్లుబాటు: 1 రోజు

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top