
సాధారణంగా ఎక్కువమంది తక్కువ ధరలో.. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ ఉన్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్లనే ఎంచుకుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు టెలికాం కంపెనీలు సరసమైన ప్లాన్స్ ప్రవేశపెడుతున్నాయి. అయితే రిలయన్స్ జియో మాత్రం రోజుకు 1జీబీ డేటా ఇస్తున్న రూ. 249 ప్లాన్‌ను నిలిపివేసింది.
ఆగస్టు 18 నుంచి జియో తన ఎంట్రీ లెవల్ ప్లాన్ రూ. 249 (రోజుకి 1జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ)ను నిలిపివేసింది. కాబట్టి ఇప్పుడు వినియోగదారులు రూ. 299 ప్లాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్ రోజుకి 1.5 జీబీ డేటా పొందవచ్చు. దీని వ్యాలిడిటీ కూడా 28 రోజులే.
ఇప్పటి వరకు రూ. 249తో రీఛార్జ్ చేసుకున్న జియో యూజర్లు.. ఇకపై మరో 50 రూపాయలు వెచ్చించి రూ. 299 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త ప్లాన్ ద్వారా రోజుకి 1.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లు, 28 రోజుల పాటు అపరిమిత కాల్స్ పొందవచ్చు. కొంత ఎక్కువ డేటా కావాలనుకునే వినియోగదారులకు ఇది మంచి ఎంపిక అవుతుంది.
ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్‌కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
ఇది కాకుండా రూ. 189 ప్లాన్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా 2జీబీ డేటా, 300 ఎస్ఎమ్ఎస్‌లు, 28 రోజులపాటు అపరిమిత కాల్స్ పొందవచ్చు. డేటా అవసరం లేదు అనుకున్న యూజర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే కంపెనీ 1జీబీ డేటా ఇచ్చే ప్లాన్ తిరిగి ఎప్పుడు ప్రవేశపెడుతుంది? అనే వివరాలు వెల్లడికాలేదు. బహుశా ఈ ప్లాన్ మళ్ళీ తీసుకొచ్చే అవకాశం లేదని అనిపిస్తోంది.