రీ’ చార్జ్‌తో రయ్‌..రయ్‌..

Electrical Recharge Stations For YSR kadapa - Sakshi

జిల్లాకు 7 ఎలక్ట్రికల్‌ రీచార్జ్‌ స్టేషన్లు

స్థలాలను గుర్తించిన విద్యుత్‌శాఖ అధికారులు

కడప అగ్రికల్చర్‌: వాహనంలో పెట్రోలు అయిపోయిందన్న బెంగ ఇక ఉండదు. వాహనదారులు టెన్షన్‌ పడాల్సిన పని అసలే ఉండదు..పెట్రోలు, డీజిల్‌ పెరుగుతున్న తరుణంలో ఎలక్ట్రికల్‌ బ్యాటరీతో నడిచే వాహనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. జిల్లాలో ప్రయోగాత్మకంగా బ్యాటరీతో నడిచే వాహనాలకు రీచార్జ్‌ చేయిం చుకునే కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి. ఇక నుంచి వాహనదారులు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని విద్యుత్‌ అధికారులు అంటున్నారు. జిల్లాకు ఎలక్ట్రికల్‌ రీచార్జ్‌ స్టేషన్లు మంజూరయ్యాయని తెలిపారు. వీటిని ఏర్పాటు చేయిం చేందుకు అధికారులు జిల్లా కేంద్రంలో సన్నాహాలు ప్రారంభించారు. ఈ స్టేషన్ల నిర్మాణాలను వచ్చే జనవరి లోపల పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సెల్‌ఫోన్‌లకు ఏ విధంగా చార్జింగ్‌ చేస్తామో ఆ తరహాలో ఈ ఎలక్ట్రికల్‌ వాహనాలకు కూడా రీచార్జ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం స్థలాలను గుర్తించి ఇస్తే నిర్వాహకులు సే ్టషన్లను ఏర్పాటు చేస్తామని ఒప్పందం కు దుర్చుకున్నారు. విద్యుత్‌శాఖ అధికారులుఆయా స్టేషన్లకు సరఫరాను ఇస్తారు. స్టేషన్ల ఏర్పాటు నుంచి బిల్లును నిర్వాహకుల నుంచి వసూలు చేస్తారు.

కడప నగరంలో ఏడు ఎలక్ట్రికల్‌ రీచార్జ్‌ స్టేషన్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణాలను ఎనర్జీ ఎపిషియన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌ వారు  చేపట్టనున్నారు. స్థలాలను విద్యుత్‌శాఖ అధికారులు పరిశీలించి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రాంతాలు ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ఉండడంతో ఆయా శాఖల ఉన్నతాధికారులు ఒకసారి పరిశీలించి అనుమతులు ఇచ్చేలా నోట్‌ ఫైల్‌ తయారు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ స్టేషన్లలో వాహనానికి ఒక గంట చార్జింగ్‌ చేస్తే 20 కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చు. కారుకు ఐదు గంటలు చార్జింగ్‌ చేస్తే 120కిలో మీటర్లు సరిపోతుందని విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. గంట చార్జింగ్‌ చేస్తే  నిర్వహకులు రూ.3 వసూలు చేస్తారు. ఒక్కో స్టేషన్‌ నిర్మాణానికి రూ.3 నుంచి 5 లక్షలు పెట్టుబడి అవుతుందని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. 

కడప నగరంలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. మొదట ప్రభుత్వ ఉన్నతాధికారు వాహనాలన్నీంటికి ఎలక్ట్రిక్‌ బ్యాటరీలను అమర్చి వాటికి చార్జింగ్‌ ఇచ్చి నడుపుతారు. ఆ తరువాత ఇతర అధికారుల వాహనాలకు ఈ బ్యాటరీలు అమర్చుకునే అవకాశం కల్పిస్తారు.

కడప నగరంలో ఎక్కడెక్కడ నిర్మిస్తారంటే
కడప నగరంలో పాత కలెక్టరేట్‌లోను, పాత మున్సిపల్‌ కార్యాలయం, జిల్లా పరిషత్‌ కార్యాలయ ఆవరణల్లోనూ, పోలీసు పెట్రోల్‌ బంక్‌ కో ఆపరేటివ్‌ కాలనీ, ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఐటీఐ సర్కిల్, కొత్త కలెక్టరేట్, మార్కెట్‌యార్డు దేవుని కడపరోడ్డులో ఈ రీచార్జ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టేషన్లను ఈఈఎస్‌ఎల్‌ కంపెనీ వారు నిర్వహిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top