Airtel vs Vodafone Idea vs Vodafone Idea: ఎయిర్‌,జియో,వొడాఫోన్‌..అదిరిపోయే ప్లాన్‌లు ఇవే!

Best Airtel,vodafone And Reliance Jio Plans   - Sakshi

ఈ ఏడాది జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా మరోసారి టారిఫ్‌లు పెంచే అవకాశాలు ఉన్నాయి. దీంతో 2022–23లో టెల్కోల ఆదాయాలు 20–25 శాతం పెరగనున్నాయని దేశీ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ వెల్లడించింది. అందుకే  ప్రస్తుతానికి, రోజువారీ ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాలింగ్, లాంగ్‌ టైమ్‌ వ్యాలిడిటీతో తక్కువ మొత్తంలో ఎక్కువ ప్రయోజనాల్ని అందించే టారిఫ్‌ ధరల్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. అయితే ఇప్పుడు మనం మూడు టెలికాం సంస్థల్లో ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.   

వోడాఫోన్ ఐడియా
వోడాఫోన్ ఐడియా రూ.400లోపు ప్లాన్‌లను అందిస్తుంది. ముఖ్యంగా రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 డేటా,అపరిమిత కాల్‌లు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను పొందవచ్చు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా, వారాంతపు డేటా రోల్‌ఓవర్, వీఐ సినిమాలు, ప్రతి నెలా 2జీబీ వరకు బ్యాకప్ డేటా పొందవచ్చు. 

రూ.359 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్‌లు, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో అదనపు ప్రయోజనాల్ని అందిస్తుంది. వారాంతపు డేటా రోల్‌ఓవర్, వీఐ సినిమాలు, టీవీని ఫ్రీగా యాక్సిస్‌ చేయోచ్చు. ప్రతి నెలా 2జీబీ వరకు బ్యాకప్ డేటా పొందవచ్చు. 

రూ.399 ప్లాన్‌లో 28రోజుల వ్యాలిడిటీతో 3నెలల డిస్నీ ప‍్లస్‌ హాట్‌స్టార్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో రోజుకు 2.5జీబీ డేటాను పొందవచ్చు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా,వారాంతపు డేటా రోల్‌ఓవర్, వీఐ సినిమాలు, టీవీని ఫ్రీగా యాక్సిస్‌ చేయోచ్చు. ప్రతి నెలా 2జీబీ వరకు బ్యాకప్ డేటా పొందవచ్చు. 

ఎయిర్‌టెల్
28రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2.5జీబీ డేటా, అపరిమిత కాల్‌లు, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్లను పొందవచ్చు.  

28రోజుల వ్యాలిడిటీతో రూ. 359 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్‌లను అందిస్తుంది. 

28 రోజుల వ్యాలిడిటీతో రూ. 319 ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ పొందచ్చు. 

జియో
28రోజుల వ్యాలిడిటీతో రూ.299 ప్రీపెయిడ్ పెయిడ్ ప్లాన్. 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్‌ఎంఎస్‌ పొందవచ్చు. 
 
రిలయన్స్ జియో 30 రోజుల వ్యాలిడిటీతో రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రోజుకు 1.5జీబీ డేటాను అందిస్తుంది. మీ రోజువారీ డేటా ముగిసిన తర్వాత, మీరు 64కేబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయోచ్చు. రోజువారీ డేటా ప్రయోజనాలతో పాటు, రిలయన్స్ జియో ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది. మీరు రోజుకు 100ఎస్‌ఎంఎస్‌, జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top