365 రోజులు ఎంతసేపైనా మాట్లాడుకునేలా.. | BSNL Yearly Recharge Plan A Game Changer In Budget Telecom, Check Out Plan Details And Price Inside | Sakshi
Sakshi News home page

BSNL Best Yearly Plan: 365 రోజులు ఎంతసేపైనా మాట్లాడుకునేలా..

Aug 7 2025 9:38 AM | Updated on Aug 7 2025 10:10 AM

BSNL Yearly Recharge Plan A Game Changer in Budget Telecom

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ఇయర్లీ ప్లాన్‌

బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్లు అందించడంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను తక్కువ ధరలకు అందించడం ద్వారా తన యూజర్ బేస్‌ను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ తన తాజా ఆఫర్లలో కేవలం రూ.1,999 ధరతో ఇయర్లీ ప్లాన్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్‌ చేస్తున్న ఈ ప్లాన్‌ను పోటీ టెలికాం సంస్థల కంటే తక్కువ ధరకే అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

  • వ్యాలిడిటీ: 365 రోజులు

  • డేటా: ఒకేసారి 600 జీబీ(రోజువారీగా 1.64 జీబీ)

  • వాయిస్ కాలింగ్: అపరిమిత కాల్స్‌ చేయవచ్చు.

  • ఎస్‌ఎంఎస్‌: రోజుకు 100

  • ప్లాన్‌ ధర: రూ.1,999

ఇదీ చదవండి: త్వరలో యూఎస్‌ కొత్త వీసా బాండ్‌ పైలట్‌ ప్రోగ్రామ్‌

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు కొత్త కొత్త ప్లాన్స్, ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న తరుణంలో.. ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇలాంటి సరికొత్త ప్లాన్లును తీసుకొస్తుంది. కేవలం ఒక రూపాయితోనే 30 రోజుల అపరిమిత కాల్స్ అందిస్తున్నట్లు, ఇండిపెండెన్స్‌డే సందర్భంగా ఈ ఆఫర్‌ ప్రకటిస్తున్నట్లు ఇటీవల ట్వీట్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement