
మీరు మీ మొబైల్ ఫోన్ రీఛార్జ్ ఎలా చేస్తున్నారు? పేటీఎం నుంచి చేస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. పేటీఎం యాప్ నుంచి మొబైల్ రీఛార్జ్ చేస్తే అందుకు అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పేటీఎం యాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్ చేస్తే ఎంత అదనపు ఛార్జీలు వసూలు చేస్తుందనే విషయం వెలుగులోకి రాలేదు. కానీ పలు నివేదికలు మాత్రం రూ.1 నుంచి రూ.6 మధ్యలో అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పేటీఎం వ్యాలెట్, యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు.. ఇలా ఏ పేమెంట్ విధానం అయినా సర్‌ఛార్జి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.100కి మించిన ట్రాన్సాక్షన్‌లు చేస‍్తే వాటిపై సర్ ఛార్జీల మోత తప్పదనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.