జియో తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే.. హై-స్పీడ్ ఇంటర్నెట్ ఉపయోగించేవారు కొరకు.. మూడు అద్భుతమైన ఫ్యాక్స్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా డేటా మాత్రమే కాకుండా.. ఫ్రీ టీవీ ఛానెల్స్, ఓటీటీ యాప్‌లకు ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.
రూ. 599 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడంతో.. మీకు 30Mbps ఇంటర్నెట్ వేగం.. 1000GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. ఫ్రీ వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. అంతే కాకుండా.. 800 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు, జియో హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 తో సహా 11 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు.
రూ. 899 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ 100Mbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. 1000GB హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. కాగా ఈ ప్లాన్ 800కి పైగా టీవీ ఛానెల్‌లు, జియో హాట్‌స్టార్, సోనీ లివ్ & జీ5 తో సహా 11 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు.
రూ. 1199 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ 100Mbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. మీకు మొత్తం 1000GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో వస్తుంది. 800కి పైగా టీవీ ఛానెల్స్, నెట్‌ఫ్లిక్స్ (బేసిక్), అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో సహా 15 ఓటీటీ యాప్‌లకు ఉచిత యాక్సెస్ కూడా పొందవచ్చు.
ఇదీ చదవండి: అరట్టైను తెలుగులో ఎలా పిలవాలంటే?: శ్రీధర్ వెంబు


