రిలయన్స్‌ జియో బంఫర్‌ ఆఫర్‌.. రీచార్జ్‌ ఒకటే.. బెనిఫిట్స్‌ ఆరు!

Reliance Jio 6th Anniversary Offers On Recharge 6 Benefits For Users - Sakshi

టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో అరగ్రేటంలోనే అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా ప్రకటించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి అదిరిపోయే ఆఫర్లతో కస్టమర్లను తన వైపు తిప్పుకుంటూ దూసుకెళ్తోంది. ఫ్రీ ఆఫర్‌తో మొదలెట్టిన దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించింది. ప్రస్తుతం రిలయన్స్ జియో (Reliance Jio) 6వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇందులో భాగంగా, తన  కస్టమర్లు ₹2,999 వార్షిక రీఛార్జ్ ప్లాన్‌తో 6 బెనిఫిట్స్‌ పొందేలా ఓ ప్లాన్‌ని తీసుకొచ్చింది.

ఈ మేరకు “రూ.2999 ప్లాన్‌తో 6 సంవత్సరాల జియోపై 6 బెనిఫిట్స్‌ పొందండి. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి" అని రిలయన్స్ జియో అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 3, 2022 నుంచి అందుబాటులో ఉండనుంది.

రిచార్జ్‌ ఒకటే.. బెనిఫిట్స్‌ ఆరు
►రూ.2,999 ప్లాన్‌తో రీచార్జ్‌తో.. అదనంగా 75జీబీ హైస్పీడ్‌ డేటా ఉచితం. 
►ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో(ixigo)కు చెందిన రూ.750 విలువైన కూపన్ దక్కుతుంది. ( రూ. 4500 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలుపై)
►నెట్‌మెడ్స్‌ (Netmeds)లో రూ.1000 కొనుగోలుపై 25శాతం డిస్కౌంట్ లభించేలా కూపన్ 
►జియోకు చెందిన షాపింగ్ సైట్‌ ఆజియో(Ajio) లో రూ.2990 కోనుగోలుపై రూ.750 విలువైన కూపన్ లభిస్తుంది.
►రిలయన్స్ డిజిటల్‌ (Reliance Digital)లో రూ.5,000 కొనుగోలుపై రూ.500 తగ్గింపు పొందేలా కూపన్
►జియో సావన్ ప్రో ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్‌పై 50శాతం తగ్గింపుతో కూపన్ లభిస్తుంది.

ఆఫర్‌ ప్రకారం ₹2,999 ప్రీపెయిడ్ ప్లాన్‌తో మీ జియో నంబర్‌ను రీఛార్జ్ చేసిన తర్వాత, అన్ని వోచర్‌లు, కూపన్‌లు మై జియో యాప్‌ ద్వారా కూపన్స్‌ని ఉపయోగించుకోవచ్చ.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top