షాకిచ్చిన ఎయిర్‌టెల్‌, రెట్టింపు బాదుడు

Airtel Hikes RS 23 to 45 Minimum Monthly Planning Recharge - Sakshi

రూ.45 రీచార్జ్‌తోనే ఎయిర్‌టెల్‌ నంబర్‌ రింగింగ్‌!

న్యూఢిల్లీ: ఇక మీదట ఎయిర్‌టెల్‌ కస్టమర్లు ప్రతీ 28 రోజులకు చేసుకోవాల్సిన కనీస రీచార్జ్‌ మొత్తాన్ని కంపెనీ రూ.23 నుంచి రూ.45కు పెంచింది. ‘‘ప్రతీ 28 రోజులకు కనీసం రూ.45 లేదా అంతకుమించి రీచార్జ్‌ చేసుకుంటేనే సేవలు లభిస్తాయి’’ అని ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఈ నెల 29 నుంచే ఇది అమల్లోకి వస్తుందని కూడా తెలిపింది. ప్రస్తుత టారిఫ్‌ గడువు ముగిసే నాటికి రూ.45 లేదా అంతకుమించిన రీచార్జ్‌ చేసుకోకపోతే.. సంబంధిత ప్లాన్‌ ప్రయోజనాలను తదుపరి 15 రోజుల గ్రేస్‌ పీరియడ్‌లో అందించడం అన్నది కంపెనీ అభీష్టంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top