ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌.!

Airtel Brings Rs 456 New Prepaid Recharge Plan With Huge Offers - Sakshi

సాక్షి, ముంబై: జియోకు పోటీగా భారతి ఎయిర్‌టెల్‌ తన వినియోగదారులకు కొత్తగా మరో ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ను లాంచ్‌ చేసింది. తాజాగా జియో గతవారం తన వినియోగదారుల కోసం రూ. 447 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ను ప్రకటించింది. దీనికి పోటీగా ఎయిర్‌టెల్‌ రూ. 456 రీఛార్జ్‌ను అందించనుంది.  ఈ రీఛార్జ్‌తో  అపరిమిత వాయిస్‌ కాల్స్‌తో పాటు 50 జీబీ డేటా , రోజుకు 100 ఫ్రీ ఎస్‌ఎమ్‌ఎస్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌ గడువు 60 రోజులుగా ఉండనుంది. ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌తో పాటు గూగుల్ పే, పేటీఎం యాప్‌ల్లో రీఛార్జ్‌ చేసుకోవచ్చును.

ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన కొత్త రీఛార్జ్‌తో పలు బంపర్‌ ఆఫర్లను ఇస్తుంది. 30 రోజుల పాటు పలు సర్వీస్‌లను ఉచితంగా పొందవచ్చు.. ఈ రీఛార్జ్‌తో రూ. 100 ఫాస్ట్‌టాగ్‌ క్యాష్‌బ్యాక్‌ రానుంది.

ఈ కొత్త రీఛార్జ్‌తో రానున్న ఆఫర్లు

  • అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్   
  • ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం
  • వింక్ మ్యూజిక్‌

చదవండి: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ వినియోగదారులకు శుభవార్త..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top