మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ వినియోగదారులకు శుభవార్త..!

Windows 11 May Be Available as a Free Upgrade for Windows 7 And 8 - Sakshi

విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వినియోగదారులకు మైక్రోసాఫ్ట్‌ తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం ఉన్న విండోస్‌ 10 యూజర్లకు మైక్రోసాఫ్ట్‌ నుంచి రాబోయే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విండోస్‌ 11 ను ఫ్రీ అప్‌గ్రేడ్‌గా చేసుకోవచ్చునని ఇది వరకే ప్రకటించింది. కాగా ప్రస్తుతం విండోస్‌ 10 యూజర్లకే కాకుండా విండోస్‌7, విండోస్‌ 8.1 ఆపరేటింగ్‌ యూజర్లకు కూడా ఉచితంగా విండోస్‌ 11ను అప్‌గ్రేడ్‌ చేసుకొవచ్చునని మైక్రోసాఫ్ట్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 

విండోస్‌ 8 వాడుతున్న యూజర్లు మాత్రం డైరక్ట్‌గా ఆప్‌గ్రేడ్‌ను పొందలేరు. ఈ  లేటేస్ట్‌ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఎక్కువ మంది యూజర్లను పాత ఆపరేటింగ్‌ సిస్టమ్‌లనుంచి దృష్టిమరల్చడానికి ఫ్రీ ఆప్‌గ్రేడ్‌ను మైక్రోసాఫ్ట్‌ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఉ‍న్న విండోస్‌ 7, విండోస్‌ 8.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌లను మైక్రోసాఫ్ట్‌ భవిష్యత్తులో పట్టించుకపోవచ్చును. 

అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ స్టాట్‌కౌంటర్ అందించిన డేటా ప్రకారం..విండోస్ 10 తర్వాత విండోస్ 7 ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గా నిలిచింది. విండోస్‌ 7 వోఎస్‌ మే 2021 నాటికి మార్కెట్ వాటాలో 15.52 శాతం. విండోస్ 8.1 తరువాత 3.44 శాతం వాటాగా ఉంది. కాగా విండోస్ 8  మార్కెట్‌లో 1.27 శాతం వాటా ఉంది.

విండోస్ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను  జూన్ 24 న లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం విండోస్‌ 11 ఆపరేటింగ్‌  సిస‍్టమ్‌ పాత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వాడుతున్న వారికి వెంటనే ఆప్‌గ్రేడ్‌ ఇచ్చే విషయంపై అస్పష్టత నెలకొంది.

చదవండి: Microsoft Chairman 2021 : నూతన ఛైర్మన్‌గా సత్యనాదెళ్ల

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top