Microsoft Chairman 2021 : నూతన ఛైర్మన్‌గా సత్యనాదెళ్ల

Microsoft CEO Satya Nadella named as chairman - Sakshi

తెలుగు తేజం మరో ఘనత

మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల

సాక్షి, న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన, తెలుగు తేజం సత్య నాదెళ్ల మరో ఘనతను సాధించారు. టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నూతన ఛైర్మన్‌గా  సత్య నాదెళ్ల  నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్‌ జాన్‌ తాంసన్‌ స్థానంలో, ప్రస్తుత సీఈవోను కొత్త ఛైర్మన్‌గా కంపెనీ ఎంపిక చేసింది. 2014 లోమైక్రోసాఫ్ట్‌  సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.

కాగా సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తరువాత చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తాంసన్‌ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నట్లు కంపెనీ తెలిపింది. స్టీవ్ బాల్‌మెర్ నుండి 2014 లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాదెళ్ల, లింక్డ్ఇన్, న్యూయాన్స్ కమ్యూనికేషన్స్, జెనిమాక్స్ లాంటి బిలియన్ డాలర్ల కొనుగోళ్లు, అనేక డీల్స్‌తో  మైక్రోసాఫ్ట్‌ వృద్దిలో కీలకపాత్ర పోషించారు.అయితే  దాతృత్వ పనులు నిమిత్తం బోర్డు నుంచి వైదొలగుతానని బిల్‌గేట్స్‌ ప్రకటించిన సంవత్సరం తరువాత ఉన్నత స్థాయి కీలక ఎగ్జిక్యూటివ్‌ల మార్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు బిల్‌గేట్స్‌  విడాకులు, ఉద్యోగితో గేట్స్ సంబంధాలపై దర్యాప్తు జరిపినట్లు కంపెనీ గత నెలలో  ప్రకటించిన సంగతి తెలిసిందే.  అయితే గేట్స్‌ను  బోర్డునుంచి తొలగిస్తుందా అనే దానిపై స్పందించడానికి మైక్రోసాఫ్ట్ నిరాకరించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top