
ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. భారతదేశంలో 4జీ నెట్‌వర్క్‌ను పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో అధికారికంగా ప్రారంభించింది. వినియోగదారుల కనెక్టివిటీని పెంచడానికి, బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే దాదాపు లక్ష కొత్త 4G టవర్లను ఏర్పాటు చేసింది. కాగా 4జీ నెట్‌వర్క్‌ని ఏడాదిలోగా 5జీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఇప్పటికే వెల్లడించారు. ఈ తరుణంలో ఒక స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ (రూ.1999) కూడా పరిచయం చేసింది.
బీఎస్ఎన్ఎల్ 1999 రూపాయల రీఛార్జ్ ప్లాన్.. 330 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ ఇంకో రెండు రోజలు (అక్టోబర్ 15) మాత్రం అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.
ప్రయోజనాలు
➤కాలింగ్: భారతదేశం అంతటా అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్ కూడా.
➤డేటా: రోజుకు 1.5జీబీ హై-స్పీడ్ డేటా, మొత్తం డేటా 495జీబీ
➤ఎస్ఎమ్ఎస్: రోజుకు 100 ఫ్రీ ఎస్‌ఎమ్‌ఎస్‌లు
➤స్పెషల్ ఆఫర్: బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్ లేదా సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. 2 శాతం వరకు అదా చేయవచ్చు.
ఓటీటీ బెనిఫిట్స్
ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు.. 350 కంటే ఎక్కువ టీవీ ఛానల్స్, వివిధ ఓటీటీ అప్లికేషన్‌లకు యాక్సెస్ పొందవచ్చు. ప్రీమియం ఛానెల్స్, అదనపు ఓటీటీ కంటెంట్ యాక్సెస్ కోసం యూజర్ BiTVకి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకోవచ్చు. మొత్తం మీద ఇతర టెలికాం కంపెనీల ప్లాన్స్ కంటే.. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ప్రయోజనకారిగా ఉంటుందని తెలుస్తోంది.