
భారత ప్రభుత్వం యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ 'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్' (BSNL), జియో & ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ టెలికాం దిగ్గజాలకు సవాలు విసురుతూ కేవలం రూ.225 ధరకే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. రూ.250 కంటే తక్కువ ధరకే అత్యుత్తమ ప్రయోజనాలను అందించడం ద్వారా ఎక్కువమంది వినియోగదారులను ఆకట్టుకునే చర్యలో భాగంగానే బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ తీసుకొచ్చింది.
బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన రూ. 225 ప్లాన్.. 30 రోజులు చెల్లుబాటు అవుతుంది. అంటే రోజువారీ ఖర్చు రూ.7.50 అన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా వినియోగదారుడు రోజుకు 2.5 జీబీ హైస్పీడ్ డేటా, ఏ నెట్‌వర్క్‌కు అయినా.. అపరిమిత లోకల్ & ఎస్టీడీ కాలింగ్ లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లు లభిస్తాయి. ఇన్ని ప్రయోజనాలను అందించే ఈ ప్లాన్.. ఇతర ప్రైవేట్ ఆపరేటర్స్ ప్లాన్స్ కంటే చౌక.
బీఎస్ఎన్ఎల్ ఇతర రీఛార్జ్ ప్లాన్స్
రూ.199 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, వీటన్నింటితో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను కూడా అందిస్తుంది. దేశంలోని ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో పోలిస్తే రూ .199 ప్లాన్ ఆర్థిక ప్రయోజనాలు, అధిక ప్రయోజనాలను కలిగి ఉందని పేర్కొంటూ బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్యాక్‌ను ప్రవేశపెట్టింది.
బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ నెట్‌వర్క్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ "స్వదేశీ" 4G స్టాక్‌ను ప్రారంభించారు. ఇది 'ఆత్మనిర్భర్ భారత్' దార్శనికత వైపు ఒక పెద్ద ముందడుగును సూచిస్తుంది. ఈ 4G టెక్నాలజీని పూర్తిగా దేశీయ సాఫ్ట్‌వేర్ & హార్డ్‌వేర్‌పై నిర్మించారు. దీనిని భారతీయ కన్సార్టియం అభివృద్ధి చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 98,000 సైట్‌లలో 4G సేవను విస్తరించాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు.