డేటా ఎక్కువ వినియోగిస్తున్నారా? జియో కొత్త ప్లాన్‌ వచ్చేసింది!

Reliance Jio Rs 222 Add On Data Plan Announced With 50gb Total Data - Sakshi

వివిధ రకాల ఆఫర్లతో ఆకట్టుకుంటూ కస్టమర్ల సంఖ్య పెంచుకుంటూ పోతోంది ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. తాజాగా మరో సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్‌ డేటా ఎక్కువగా వినియోగించే వారి కోసం 4జీ డేటా యాడ్ ఆన్ ప్రీపెయిడ్ ప్యాక్ (Data Add on plan) తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫిఫా వాల్డ్ కప్ ఖతర్ 2022 జరుగుతున్న నేపథ్యంలో ఫుట్‌బాల్ లవర్స్ కోసం ఈ యాడ్‌ ఆన్‌ ప్లాన్‌ని ప్రారంభించింది. ప్లాన్‌ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇది రూ.222 ధరకు డేటా యాడ్ ఆన్ ప్లాన్, దీని వ్యాలిడిటీ 30 రోజులు. ఈ ప్యాక్‌ మొత్తం 50GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అంటే 1GB డేటా కోసం వినియోగదారులు రూ.4.44 చెల్లిస్తారు. దీని గడువు ముగిసేలోపు మొత్తం డేటా ఉపయోగిస్తే, నెట్‌వర్క్ స్పీడ్‌ 64Kbpsకి పరిమితం అవుతుంది. 

ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఫుట్‌బాల్ వరల్డ్ కప్ డేటా ప్యాక్‌ను ఇప్పటికే ఉన్న బేస్ ప్లాన్‌తో కలిపి ఉపయోగించాల్సి ఉంటుంది. యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్ కింద అందించే రోజువారీ డేటా అయిపోయిన తర్వాత ఈ 50GB డేటా వాడుకోవచ్చు. ఇదే కాకుండా రూ. 181, రూ. 241,  రూ. 301 ధరలతో ఇలాంటి మరిన్ని యాడ్-ఆన్ డేటా ప్యాక్‌లు కూడా జియో అందిస్తోంది.

చదవండి ‘మీ పర్‌ఫార్మెన్స్‌ బాగలేదయ్యా’..పిచాయ్‌ వార్నింగ్‌..ఆందోళనలో గూగుల్‌ ఉద్యోగులు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top