ఎయిర్టెల్‌ యూజర్లకు భారీ షాక్‌! ఇక కనీస రీచార్జ్‌ ప్లాన్‌ ఎంతంటే?

Airtel raises price of minimum monthly recharge plan by 57PC to Rs 155 - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్‌ తన వినియోగదారులకు భారీ షాక్‌ ఇచ్చింది. తన నెలవారీ  రీచార్జ్‌ ప్లాన్‌ ఏకంగా 57 శాతం పెంచేసింది.  తన కనీస రీఛార్జ్ ధర 28 రోజుల మొబైల్‌ఫోన్ సర్వీస్ ప్లాన్ ధరను సుమారు 57 శాతం పెంచి రూ. 155కి పెంచినట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. 

ఇదీ చదవండి: వన్‌ప్లస్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? ఇదే లక్కీ చాన్స్‌!

కంపెనీ వెబ్‌సైట్  ప్రకారం కంపెనీ రూ.99 కనీస రీఛార్జ్ ప్లాన్‌ను నిలిపివేసింది. ఇప్పుడు అపరిమిత కాలింగ్, 1 జీబీ డేటా, 300 SMSలతో రూ.155 ప్లాన్‌ను  ప్రారంభించింది. అయితే ఈ ప్లాన్‌ హరియాణా,  ఒడిశాలకు పరిమితమైన ఈ కొత్త ప్లాన్‌ను మిగిలిన ప్రదేశాల్లో కూడా అమలు చేయనుందనే ఆందోళన యూజర్లలో నెలకొంది. అటు తొలుత ట్రయల్‌గా లాంచ్‌ చేసిన ఈ ప్లాన్‌ను భారతదేశం అంతటా విడుదల చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలో, 2021లో ఎంపిక చేసిన సర్కిల్‌లలో కనీస రీఛార్జ్ ఆఫర్‌ను రూ.79 నుండి రూ.99కి పెంచినప్పుడు కంపెనీ ఇదే తరహా  విధమైన కసరత్తు (మార్కెట్-టెస్టింగ్) చేసిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్  నివేదిక పేర్కొంది.

ఇది చదవండి: ‘రస్నా’ ఫౌండర్‌ కన్నుమూత, ‘మిస్‌ యూ’ అంటున్న అభిమానులు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top