జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటిస్తున్న సమయంలో.. బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లి రూ. 225 ప్లాన్ ప్రవేశపెట్టింది. కొంత ఎక్కువ డేటా కావాలనుకునే కస్టమర్లకు ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.
బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన రూ. 225 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 75 జీబీ డేటా (రోజుకు 2.5 జీబీ), అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. జియో & ఎయిర్‌టెల్ వంటి టెలికాం బ్రాండ్‌లు తమ ప్రాథమిక ప్రీపెయిడ్ ప్లాన్‌లను రూ. 250 కంటే ఎక్కువకు పెంచినప్పటికీ, BSNL తన వినియోగదారులకు చాలా సరసమైన & డబ్బుకు తగిన విలువైన ప్లాన్‌ను అందిస్తూనే ఉంది.
రూ. 255 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 30 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే నెల రోజులు చెల్లుబాటు అవుతుందన్నమాట. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ అయినప్పటికీ.. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, బీఎస్ఎన్ఎల్ సినిమా, ఎరోస్ నౌ యాప్ వంటి కొన్ని ఫ్రీ యాడ్ ఆన్ సేవలను పొందవచ్చు. అంటే కాలింగ్ & ఇంటర్నెట్‌తో పాటు వినోదాన్ని ఆస్వాదించడానికి ఈ ప్లాన్ మిమ్మల్ని అనుమతిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ రూ. 347 ప్లాన్
బీఎస్ఎన్ఎల్ 50 రోజుల వ్యాలిడిటీతో రూ. 347 ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 2 జీబీ డేటా ఉపయోగించుకుపోవచ్చు. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా ఉంటుంది. వినియోగదారులు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు.
ఇదీ చదవండి: శివ్ నాడార్.. జాబితాలో అంబానీ కంటే ముందు: రూ.2708 కోట్లు..


