భారతదేశంలోని బిలియనీర్లు డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.. దానం చేయడంలో కూడా ముందున్నారు. హురున్ ఇండియా విడుదల చేసిన జాబితా ప్రకారం.. 2025లో దేశంలోని ధనవంతులు రూ. 10,380 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ విరాళాలు గత ఏడాదికంటే 85 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ & కుటుంబం.. ఏడాదిలో రూ. 2,708 కోట్ల విరాళాలు ఇచ్చి, నాల్గవసారి భారతదేశ అత్యంత ఉదారవాది అనే బిరుదును నిలుపుకున్నారు. నాడార్ రోజుకు రూ. 7.4 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. విద్య, కళలు, సంస్కృతి వంటిని ప్రోత్సహించే శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా డబ్బును ఖర్చు చేశారు.
జాబితాలోని ఈ ఏడాది.. టాప్ 10 దాతలు సమిష్టిగా రూ. 5,834 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది గత సంవత్సరం కంటే 26 శాతం ఎక్కువ, అంటే మొత్తం విరాళాలలో 56 శాతం అన్నమాట. జాబితాలో రెండో స్థానంలో ముకేశ్ అంబానీ & ఫ్యామిలీ ఉంది.
కుటుంబం & విరాళాలు
➤శివ్ నాడార్ & కుటుంబం: రూ. 2708 కోట్లు
➤ముకేశ్ అంబానీ & ఫ్యామిలీ: రూ. 626 కోట్లు
➤బజాజ్ ఫ్యామిలీ: రూ. 446 కోట్లు
➤కుమార్ మంగళం బిర్లా & కుటుంబం: రూ. 440 కోట్లు
➤గౌతమ్ అదానీ & ఫ్యామిలీ: రూ. 386 కోట్లు
➤నందన్ నీలేకని: రూ. 365 కోట్లు
➤హిందుజా ఫ్యామిలీ: రూ. 298 కోట్లు
➤రోహిణి నీలేకని: రూ. 204 కోట్లు
➤సుధీర్ & సమీర్ మెహతా: రూ. 189 కోట్లు
➤సైరస్ & ఆడారు పూనావాలా: రూ. 173 కోట్లు
The Top 10 philanthropists in the EdelGive Hurun India Philanthropy List 2025 donated INR 5,834 Cr — up 26% YoY, forming 56% of India’s total giving.
Shiv Nadar & family lead with INR 2,708 Cr, followed by Mukesh Ambani & family, Bajaj family, Kumar Mangalam Birla & family. pic.twitter.com/kS2ZVxlCW4— HURUN INDIA (@HurunReportInd) November 6, 2025


