
దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటైన ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ సేవలతో పాటు, బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను కూడా అందిస్తోంది. మొబైల్ టారిఫ్‌లు పెరిగిన నేపథ్యంలో మీరు మొబైల్ రీఛార్జ్, బ్రాడ్ బ్యాండ్ బిల్లు లేదా డిటిహెచ్ రీఛార్జ్ పై ఆదా చేయాలనుకుంటే మీకో చక్కటి మార్గం ఉంది. దీని ద్వారా ప్రతి రీఛార్జ్ పైనా 25 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చని మీకు తెలుసా?
యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. దీని సాయంతో రీఛార్జ్ వంటి యుటిలిటీ చెల్లింపులపై బంపర్ క్యాష్ బ్యాక్ పొందడం ఈ కార్డు ప్రత్యేకత. మీరు ఎయిర్‌టెల్ రీఛార్జ్‌లలో డబ్బులు ఆదా చేయాలనుకుంటే, ఈ కార్డు మీకు సరైన ఎంపిక. దీనితో ఇతర కంపెనీల రీఛార్జ్ లపై కూడా డిస్కౌంట్లు పొందవచ్చు.
25 శాతం క్యాష్ బ్యాక్ పొందండిలా..
ఈ క్యాష్ బ్యాక్ కోసం యూజర్లు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వరా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రీఛార్జ్ కోసం ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లించినట్లయితే ఫ్లాట్ 25 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అదే సమయంలో ఇతర రీఛార్జ్ లపై కూడా 10 శాతం క్యాష్ బ్యాక్ ప్రయోజనాన్ని అందిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ 60 రోజుల్లో ప్రాసెస్ అయి నేరుగా క్రెడిట్ స్టేట్ మెంట్ లో ప్రతిబింబిస్తుంది.