
చాలామంది యూజర్లు మంత్లీ ప్లాన్స్ (28 రోజులు) రీఛార్జ్ చేసుకుంటారు. ఈ ప్యాక్ ధరలు, యాన్యువల్ ప్లాన్‌తో పోలిస్తే కొంత ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఏడాది ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఈ కథనంలో బెస్ట్ యాన్యువల్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్
ఎయిర్‌టెల్ తన యూజర్ల కోసం రూ.3599, రూ.2249 ప్లాన్స్ అందిస్తోంది. రూ.3599 రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటివాటితో పాటు.. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్ వంటివి లభిస్తాయి. కాగా రూ.2249 ప్లాన్ ద్వారా 365 రోజుల అపరిమిత కాలింగ్స్.. 30 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఇందులో డైలీ డేటా.. ఇతర సబ్‌స్క్రిప్షన్ ఉండవు.
రిలయన్స్ జియో
జియో యూజర్లకు రూ.3599, రూ.999, రూ.234, రూ.895 ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ. 3599 రీఛార్జ్ ప్లాన్ ద్వారా యూజర్లు అపరిమిత కాలింగ్స్ పొందటమే కాకుండా.. రోజుకి 2.5 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. పైగా జియో టీవీ, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.3999 ప్లాన్ ద్వారా అదనంగా జియో ప్యాక్ కోడ్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అయితే రూ.1234 ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. 336 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 0.5 జీబీ డేటా లభిస్తుంది. జియో ఫోన్ ప్రైమా యూజర్లు 336 రోజుల వాలిడిటీ కోసం రూ.895 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రతి 28 రోజులకు 2 జీబీ డేటా లభిస్తుంది.
వోడాఫోన్ ఐడియా
వోడాఫోన్ ఐడియా విషయానికి వస్తే.. ఇది తన యూజర్ల కోసం రూ. 3599తో రీఛార్జ్ ప్లాన్ అందిస్తుంది. దీని వ్యాలిడిటీ 365 రోజులు. రోజుకి 2జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్ పొందవచ్చు. అంతే కాకుండా ఈ ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే.. రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫ్రీ డేటా పొందవచ్చు. రూ.3799తో రీఛార్జ్ చేస్తే.. అదనంగా ఆమెర్జన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. రోజుకి 1.5 జీబీ చాలనుకుంటే.. రూ.3499తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. డైలీ డేటా వద్దనుకుంటే.. రూ.1999తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో ప్యాక్ మొత్తానికి 24 జీబీ డేటా లభిస్తుంది.
ఇదీ చదవండి: ఈ20 ఫ్యూయెల్ ఎఫెక్ట్.. ఫెరారీ స్టార్ట్ అవ్వడం లేదట!!
బీఎస్ఎన్ఎల్
బీఎస్ఎన్ఎల్ విషయానికి.. రూ.2399, రూ.1999, రూ. 1515 అనే ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.2399 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 600 రోజులు అపరిమిత కాల్స్, రోజుకి 2 జీబీ డేటా వంటివి లభిస్తాయి. రూ.1999 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజులు 600 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. అయితే రూ.1515 ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్, రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది.