
భారతదేశంలో ఈ20 పెట్రోల్ వినియోగించాలని కేంద్రమంత్రి 'నితిన్ గడ్కరీ' చెబుతూనే ఉన్నారు. కొందరు నిపుణులు ఇథనాల్ వినియోగం వల్ల వాహనాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. అయితే చండీగఢ్‌కు చెందిన ఒక వ్యక్తి ఈ20 ఫ్యూయెల్ పెట్రోల్ హై-ఎండ్ వాహనాలపై చూపే ప్రభావాన్ని ఎత్తి చూపాడు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక స్నేహితుడి ఫెరారీ కారుకు ఈ20 పెట్రోల్ ఉపయోగించాడు. అయితే ఆ కారు కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అవ్వలేదు. కొందరు నిపుణులు ఈ20 ఇంధనం వల్లనే.. ఈ సమస్య వచ్చిందని చెబుతున్నారు. దీనికి గడ్కరీ బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు.
నిజం ఏమిటంటే.. సూపర్ కార్లు, హై-ఎండ్ వాహనాలు ఈ ఇంధన మిశ్రమం వల్ల ఎక్కువగా ప్రభావితమవుతాయి. కానీ ఎవరూ దాని గురించి మాట్లాడటానికి ధైర్యం చేయరు. ఇథనాల్ గాలి నుంచి తేమను గ్రహిస్తుంది. ఇలా కొన్ని రోజులు జరిగిన తరువాత ఫ్యూయెల్ ట్యాంక్‌లో తేమశాతం పెరుగుతుంది. ఫలితంగా కారు స్టార్ట్ అవ్వడంలో సమస్య ఎదురవుతుందని ఆ వ్యక్తి ఎక్స్ ఖాతాలో వివరించారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఫెరారీ కారు స్టార్ట్ అవ్వకపోవడానికి ఖచ్చితంగా ఈ20 ఫ్యూయెల్ కారణమా? లేక ఇంకేమైనా సమస్యా? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే E20 ఇంధనం వల్లే ఈ నష్టం జరిగిందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారని అతను ట్వీట్‌లో పేర్కొన్నాడు. అంతే కాకుండా.. ఇప్పటి వరకు ఇథనాల్ కారణంగానే ఇలాంటి సమస్య వచ్చినట్లు ఇదివరకు కంప్లైంట్స్ రాలేదు.
ఇదీ చదవండి: నేను ముందే ఊహించాను!.. బంగారం ధరలపై క్రిస్టోఫర్ వుడ్
ఇప్పటికే బ్రెజిల్, యూఎస్ఏ, చైనా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ20 ఫ్యూయెల్ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో దీని వినియోగాన్ని పెంచాలని.. పెట్రోల్ దిగుమతులను తగ్గించాలనే ఉద్దేశ్యంతో నితిన్ గడ్కరీ.. ఈ20 పెట్రోల్‌ను ప్రోత్సహిస్తున్నారు. నిజానికి ఇథనాల్-మిశ్రమ ఇంధనం CO2 ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని.. ఇంజిన్ పనితీరును మెరుగుపరుస్తుందని పేర్కొంటూ ప్రభుత్వం 2023లో భారతదేశంలో ఈ20 పెట్రోల్‌ను ప్రవేశపెట్టింది.
ఈ20 పెట్రోల్ కారణంగా వెహికల్ మైలేజీ తగ్గుతుందని, ఇంజిన్ దెబ్బతింటుందనే ఆందోళనలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. దీనిపై గడ్కరీ స్పందిస్తూ.. E20 పెట్రోల్‌తో చెప్పుకోదగ్గ సమస్యలు ఉండవని చెబుతూ.. చెరకు, మొక్కజొన్న రైతులు ఆర్థికంగా లాభపడ్డారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన వార్షిక SIAM సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
A friend’s Ferrari was filled with E20 petrol, and just a few days later it refused to start.
The technicians say the damage is due to the E20 fuel. Now tell me, will Gadkari take responsibility for this?
After spending crores on the car, paying road tax, vehicle GST tax, and… pic.twitter.com/4j9MGBjNGS— Rattan Dhillon (@ShivrattanDhil1) September 17, 2025