
డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం, బిట్‌కాయిన్ రెండింటిపైన పెట్టుబడులు పెరుగుతాయని, మార్కెట్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని.. జెఫరీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీ స్ట్రాటజీ 'క్రిస్టోఫర్ వుడ్' పేర్కొన్నారు. గుర్గావ్‌లోని జెఫరీస్ ఇండియా ఫోరమ్‌లో మాట్లాడుతూ.. తన పోర్ట్‌ఫోలియో కేటాయింపులను కూడా వెల్లడించారు.
ప్రస్తుతం పసిడి ధరలు జీవితకాల గరిష్టాలను చేరుకున్నాయి. బంగారం ఔన్సుకు 3,698 డాలర్లకు పెరిగిన సమయంలో.. భారతదేశంలో కూడా 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.11 లక్షలు దాటేసింది.
ఔన్స్ బంగారం 3600 డాలర్లకు చేరుతుందని.. నేను 2002లోనే అనుకున్నాను. ఊహించినట్లుగానే గోల్డ్ ఆ లక్ష్యాన్ని చేరుకుందని క్రిస్టోఫర్ వుడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గోల్డ్ కొత్త ట్రేడింగ్ శ్రేణిలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. బంగారం (ఫిజికల్ గోల్డ్)పై ఆశ ఉన్నప్పటికీ.. నాకు గోల్డ్ మైనింగ్ స్టాక్‌లనే ఆసక్తి ఉందని అన్నారు. అయితే ఇది మొత్తం కంపెనీల లాభాల మీద ఆధారపడి ఉంటుంది.
ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
బిట్‌కాయిన్‌ల విలువ కూడా భారీగా పెరుగుతోంది. నేను బంగారం & బిట్‌కాయిన్ రెండింటినీ సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది ధనవంతులు బంగారాన్ని కొనుగోలు చేయకపోవచ్చు. వారంతా బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేస్తారు. రాబోయే కాలం మొత్తం బిట్‌కాయిన్, బంగారంతోనే ముడిపడి ఉందని క్రిస్టోఫర్ వుడ్ పేర్కొన్నారు.