
చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ మొబైల్ నంబర్లు ఉంటాయి. టెలికం సంస్థలు టారిఫ్‌లను పెంచేసిన నేపథ్యంలో రెండింటికీ రీచార్జ్ చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా వినియోగించే నంబర్ కాకుండా మరో నంబర్‌ను తక్కువ ఖర్చుతో యాక్టివ్ ఉంచుకొనే రీచార్జ్ ప్లాన్‌ల కోసం చాలా మంది చూస్తున్నారు.
డేటా లేకుండా కూడా మొబైల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి సహాయపడే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లను ప్రారంభించాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అన్ని ప్రధాన టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ క్రమంలో ఎయిర్‌టెల్, జియో, వీఐలు తమ డేటా ఫ్రీ ప్రీపెయిడ్ ప్లాన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
ఎయిర్‌టెల్ డేటా రహిత ప్లాన్స్
ఇంటర్నెట్ డేటా సదుపాయం లేకుండా కాలింగ్, ఎస్ఎంఎస్ ల పూర్తి ప్రయోజనాన్ని అందించే రెండు ప్లాన్లను ఎయిర్ టెల్ ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ రూ.469కి అందుబాటులో ఉంది. ఇది దేశవ్యాప్తంగా అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్, 900 ఎస్ఎంఎస్‌లను అందిస్తోంది. 365 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ.1849. ఇందులో అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్, ఏడాది పొడవునా 3600 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.
జియో లాంగ్ వాలిడిటీ ఆఫర్లు
84 రోజులు, 336 రోజుల వాలిడిటీ ఉన్న రెండు డేటా ఫ్రీ ప్లాన్లను జియో అందిస్తోంది. రూ.448 విలువైన 84 రోజుల ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, 1000 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అదే సమయంలో రూ .1748 విలువైన 336 రోజుల ప్లాన్ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ కాలింగ్, 3600 ఎస్ఎంఎస్‌ల సదుపాయాన్ని అందిస్తుంది.
వొడాఫోన్ ఐడియా ప్లాన్స్
వొడాఫోన్ ఐడియా కూడా ఎయిర్‌టెల్ మాదిరిగానే రెండు ప్లాన్లను లాంచ్ చేసింది. రూ.470 ప్లాన్‌లో యూజర్లకు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రూ.1849 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రెండు ప్లాన్లు అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్‌లను అందిస్తాయి. ఇది దాదాపు ఎయిర్‌టెల్ ఆఫర్లను పోలి ఉంటుంది.
చదవండి: ఎయిర్‌టెల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. ఓటీటీలన్నీ ఫ్రీ..