సాక్షి, గుంటూరు: నగరంలో టీడీపీ నీచ రాజకీయాలకు తెరతీసింది. చిల్లీ సెంటర్‌లో అబద్ధాలతో టీడీపీ నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ముందు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ నాయకులు ఇలా బరితెగించి విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నివేదిక ఇచ్చింది. అయినా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీపై వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి బొమ్మలు వేసి విష ప్రచారం చేస్తున్నారు. 24 గంటల్లో ఫ్లెక్సీలు తొలగించాలి. లేకపోతే మేమే ఆ ఫ్లెక్సీలు చింపేస్తాం. తిరుమల లడ్డూను రాజకీయాలకు వాడుకున్న చంద్రబాబు.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని అంబటి డిమాండ్ చేశారు. మా పార్టీ నాయకులు పైన తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోము. చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లను ఆ దేవుడు కూడా క్షమించడు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.



