గుంటూరు: ప్రస్తుత కూటమి ప్రభుత్వ తమ సమస్యలను పరిష్కరించడం లేదని రాజధాని రైతు జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదని మండిపడింది. ఈరోజు(సోమవారం, నవంబర్ 17వ తేదీ) రాజధాని రైతు జేఏసీ సమావేశమైంది.

ఈ మేరకు గ్రామ కంఠాలు, జరీబు భూములు కౌలు రైతులు, రైతు కూలీలతో పాటు అనేక సమస్యలు పై ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదంటూ ప్రశ్నించింది. రైతుల సమస్యలు గ్రీవెన్స్ డేలో ఇస్తే వాటిని చెత్తబట్టల్లో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈ నెలాఖరులో మరోసారి సమావేశమై పోరాటానికి సంబంధించిన కార్యాచరణ ఖరారు చేస్తామని హెచ్చరించింది రైతు జేఏసీ.


