నేడు వాల్మీకి జయంతి.. వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan Pays Tribute to Maharshi Valmiki on Valmiki Jayanti – YSRCP Holds Special Event in Tadepalli | Sakshi
Sakshi News home page

నేడు వాల్మీకి జయంతి.. వైఎస్‌ జగన్‌ నివాళి

Oct 7 2025 11:44 AM | Updated on Oct 7 2025 12:56 PM

YS Jagan Paid Triutes To Valmiki

సాక్షి, తాడేపల్లి: నేడు వాల్మీకి జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. వాల్మీకికి నివాళి అర్పించారు. ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని ప్రశసించారు.

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించారు. అంతకుముందు ట్విట్టర్‌ వేదికగా వైఎస్‌ జగన్‌..‘ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి, వేటగాడైన వాల్మీకి రామనామాన్ని జపిస్తూ మహర్షిగా మారిన తీరు అందరికీ ఆదర్శనీయం. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు’ అని పోస్టు పెట్టారు.  

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్‌, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన కృష్ణదాస్‌, పార్టీ సీనియర్‌ నేతలు గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, దూలం నాగేశ్వరరావు, బి.వై.రామయ్య తదితరులు పాల్గొన్నారు. 

YSRCP కార్యాలయంలో వాల్మీకి జయంతి కార్యక్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement