సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమై నేటికి ఎనిమిదేళ్లు అయ్యింది. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 341 రోజులు వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. వైఎస్ జగన్ తన పాదయాత్రలో కోట్లాది మందిని కలిసి స్వయంగా వారి బాధలను విన్నారు. నేను ఉన్నాను, నేను విన్నాను.. అంటూ భరోసా ఇచ్చారు.

నాడు వైఎస్ జగన్ పాదయాత్ర 13 జిల్లాల్లో 134 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగింది. 231 మండలాలు, 2516 గ్రామాల మీదుగా వైఎస్ జగన్ ప్రయాణం చేశారు. రాష్ట్రంలో మొత్తం 3,648 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది. వైఎస్ జగన్ పాదయాత్ర రాష్ట్ర చరిత్రని మార్చేసింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ భారీ విజయం సాధించారు. 151 అసెంబ్లీ నియోజకవర్గాలు, 22 పార్లమెంటు నియోజకవర్గాలలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులు అర్పించారు. ఇదే సమయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, రఫుల్లా, వరుదు కళ్యాణి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
LIVE: వైయస్ జగన్ గారి ప్రజాసంకల్పం పాదయాత్రకి నేటితో 8 ఏళ్లు.. పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కటింగ్ https://t.co/Q4Bl6pxlp3
— YSR Congress Party (@YSRCParty) November 6, 2025


