వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం | YS Jagan Meeting With Party Leaders At Tadepalli Update, More Details Inside | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం

Jun 25 2025 11:11 AM | Updated on Jun 25 2025 5:31 PM

YS jagan Meeting With Party Leaders At tadepalli Update

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్, పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతో పాటు, రీజినల్‌ కో–ఆర్డినే­టర్లు సహా పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. 

టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం, వైఎస్సార్‌సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై సమావేశంలో చర్చించారు. సూపర్‌సిక్స్‌ హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. పార్టీ నాయకులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.  

	YS Jagan: చంద్రబాబు మోసాలను క్యూఆర్ కోడ్ రూపంలో ఇంటింటికీ చేర్చాలి

Advertisement
 
Advertisement
Advertisement