మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అ‍హ్మద్‌ మృతిపై వైఎస్‌జగన్‌ దిగ్భ్రాంతి | YSRCP Chief YS Jagan Condolence On EX MLC Shabbir Ahmed Death, More Details Inside | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అ‍హ్మద్‌ మృతిపై వైఎస్‌జగన్‌ దిగ్భ్రాంతి

Oct 20 2025 12:39 PM | Updated on Oct 20 2025 3:39 PM

YS jagan Condolence On EX MLC Shabbir Ahmed Death

సాక్షి, తాడేపల్లి: మాజీ ఎమ్మెల్సీ మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ సాహెబ్ మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షబ్బీర్‌ అహ్మద్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. షబ్బీర్‌ అహ్మద్‌ నిస్వార్థమైన నాయకుడు. తన జీవితాన్ని సమాజ శ్రేయస్సుకే అంకితం చేశారు. షబ్బీర్‌ సేవలు శాశ్వతంగా గుర్తుంటాయి.

ఇక, మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ సాహెబ్.. జమియత్ ఉలేమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు. ఆయన సుప్రసిద్ధ ఆలిమ్-ఎ-దీన్‌ (మత గురువు), నిస్వార్థమైన నాయకుడు. ఆయన తన జీవితాన్ని పూర్తిగా మిల్లీ (జాతి), విద్యారంగం, సామాజిక సేవలకు అంకితం చేశారు. ముఖ్యంగా జమియత్ ఉలేమా ఆధ్వర్యంలో కౌమ్ (జాతి), మిల్లత్ (సమాజం) శ్రేయస్సు కోసం, అలాగే మతపరమైన, జాతీయ హక్కుల పరిరక్షణ కోసం ఆయన కృషి చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement