Shabbir Ahmed
-
లష్కరే ఉగ్రవాది అహ్మద్ లోన్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో పోస్టర్ కేసులో ఢిల్లీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. కరడుగట్టిన లష్కరే తోయిబా ఉగ్రవాది షబీర్ అహ్మద్ లోన్‌ను అరెస్ట్ చేశారు. ఘాజీపూర్‌లో ఇతడిని మార్చి 29వ తేదీ రాత్రి పట్టుకున్నట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోమవారం తెలిపింది. జమ్మూకశీ్మర్‌లోని శ్రీనగర్ వాసి అయిన షబీర్ అహ్మద్ లోన్‌కు రజా, కశీ్మరీ అనే పేర్లు కూడా ఉన్నాయని వివరించింది. పాకిస్తాన్ నిఘా విభాగం ఐఎస్ఐ నుంచి అందే ఆదేశాల ప్రకారం ఇతడు ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడంది. ఢిల్లీ, కోల్‌కతాల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల ప్రత్యక్షమైన దేశ వ్యతిరేక పోస్టర్ల వెనుక లోన్ హస్తముందని పోలీసు విభాగం పేర్కొంది. ఫిబ్రవరి 22వ తేదీన ఢిల్లీ మెట్రో స్టేషన్లో కనిపించిన పోస్టర్ కేసులో ఇతడు వాంటెడ్‌గా ఉన్నాడని వివరించింది. పట్టుబడిన లోన్ వద్ద బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ కరెన్సీ కూడా లభ్యమైంది. సిమ్, అభ్యంతరకర సాహిత్యాన్ని స్వా«దీనం చేసుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో జరిగే ఉగ్ర కార్యకలాపాలను లోన్ సమన్వయం చేస్తున్నట్లు వీటిని బట్టి తెలుస్తోందని పోలీసు విభాగం వివరించింది. దీర్ఘకాలంగా ఉగ్ర చర్యలతో సంబంధమున్న ఇతడు 2007లోనే అరెస్టయ్యాడు. అప్పట్లో లోన్ నుంచి ఏకే–47 రైఫిల్‌తోపాటు గ్రనేడ్‌ను స్వా«దీనం చేసుకున్నారు. రెండోసారి, 2015లో శ్రీనగర్‌లోని పరింపొర పోలీసులు అరెస్ట్ చేశారు. లోన్ పాక్ ఆక్రమిత కశీ్మర్లోని ముజఫరాబాద్‌లో అత్యాధునిక ఉగ్ర శిక్షణ పొందాడని ఢిల్లీ పోలీసులు వివరించారు. ఢిల్లీలో గతంలో లక్షిత హత్యలకు లోన్ ప్రణాళిక వేసినట్లు కూడా విచారణలో అంగీకరించాడని చెప్పారు. అప్పట్లో జైలు నుంచి విడుదలైన వెంటనే బంగ్లాదేశ్‌లో ఉండగానే ఐఎస్ఐ తరఫున పని చేసే లష్కరే తోయిబా హ్యాండ్లర్లు అబూ హుజైఫా, సుమమ బాబర్ అనే వారితో లోన్ సంబంధాలు పెట్టుకున్నాడని చెప్పారు. -
మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అహ్మద్ మృతిపై వైఎస్జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: మాజీ ఎమ్మెల్సీ మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ సాహెబ్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షబ్బీర్ అహ్మద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. షబ్బీర్ అహ్మద్ నిస్వార్థమైన నాయకుడు. తన జీవితాన్ని సమాజ శ్రేయస్సుకే అంకితం చేశారు. షబ్బీర్ సేవలు శాశ్వతంగా గుర్తుంటాయి.ఇక, మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ సాహెబ్.. జమియత్ ఉలేమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు. ఆయన సుప్రసిద్ధ ఆలిమ్-ఎ-దీన్ (మత గురువు), నిస్వార్థమైన నాయకుడు. ఆయన తన జీవితాన్ని పూర్తిగా మిల్లీ (జాతి), విద్యారంగం, సామాజిక సేవలకు అంకితం చేశారు. ముఖ్యంగా జమియత్ ఉలేమా ఆధ్వర్యంలో కౌమ్ (జాతి), మిల్లత్ (సమాజం) శ్రేయస్సు కోసం, అలాగే మతపరమైన, జాతీయ హక్కుల పరిరక్షణ కోసం ఆయన కృషి చేశారు. -
దైవదూషణ చేశాడన్నందుకు.. చేయి నరుక్కున్నాడు
ఇస్లామాబాద్: ఓ బాలుడ్ని (15) హింసకు పురికొల్పాడనే నేరం కింద షబ్బీర్ అహ్మద్ అనే మసీదు ఇమామ్‌ను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దైవదూషణ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ బాలుడు ఇంటికివెళ్లి తన చేతిని నరుక్కున్నాడు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. షబ్బీర్ ఓ గ్రామంలో మతోపన్యాసం చేస్తూ.. 'మీలో ఎవరైనా మహ్మద్ ప్రవక్తను ప్రేమించని వారు ఉన్నారా' అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నను సరిగా వినని బాధిత బాలుడు చేయి పైకెత్తాడు. షబ్బీర్ ఆ బాలుడ్ని బయటకు వెళ్లమని ఆదేశిస్తూ.. దైవదూషణ చేశాడని దూషించాడు. ఇంటికి వెళ్లాక ఆ బాలుడు తనను తాను శిక్షించుకున్నాడు. ఈ చర్యను బాలుడి తండ్రి అభినందించాడు. అంతేగాక మతబోధకుడిని అరెస్ట్ చేయరాదని పోలీసులను కోరాడు. పోలీసులు షబ్బీర్ అహ్మద్‌పై ఉగ్రవాద నిర్మూలన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అవిద్యావంతులైన మసీదు ఇమామ్‌లు ఉపన్యాసాలు ఇచ్చేందుకు అనుమతించబోమని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.


