
దైవదూషణ చేశాడన్నందుకు.. చేయి నరుక్కున్నాడు
ఓ బాలుడ్ని (15) హింసకు పురికొల్పాడనే నేరం కింద షబ్బీర్ అహ్మద్ అనే మసీదు ఇమామ్ను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇస్లామాబాద్: ఓ బాలుడ్ని (15) హింసకు పురికొల్పాడనే నేరం కింద షబ్బీర్ అహ్మద్ అనే మసీదు ఇమామ్ను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దైవదూషణ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ బాలుడు ఇంటికివెళ్లి తన చేతిని నరుక్కున్నాడు.
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఈ ఘటన జరిగింది. షబ్బీర్ ఓ గ్రామంలో మతోపన్యాసం చేస్తూ.. 'మీలో ఎవరైనా మహ్మద్ ప్రవక్తను ప్రేమించని వారు ఉన్నారా' అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నను సరిగా వినని బాధిత బాలుడు చేయి పైకెత్తాడు. షబ్బీర్ ఆ బాలుడ్ని బయటకు వెళ్లమని ఆదేశిస్తూ.. దైవదూషణ చేశాడని దూషించాడు. ఇంటికి వెళ్లాక ఆ బాలుడు తనను తాను శిక్షించుకున్నాడు. ఈ చర్యను బాలుడి తండ్రి అభినందించాడు. అంతేగాక మతబోధకుడిని అరెస్ట్ చేయరాదని పోలీసులను కోరాడు. పోలీసులు షబ్బీర్ అహ్మద్పై ఉగ్రవాద నిర్మూలన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అవిద్యావంతులైన మసీదు ఇమామ్లు ఉపన్యాసాలు ఇచ్చేందుకు అనుమతించబోమని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.