బంగ్లాదేశ్, పాక్, నేపాల్ కరెన్సీ స్వా«దీనం
సరిహద్దు ప్రాంతాల్లో ఉంటూ ఐఎస్‌ఐతో సంప్రదింపులు
లోన్ అరెస్ట్‌ను కీలక పురోగతిగా పేర్కొన్న ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో పోస్టర్ కేసులో ఢిల్లీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. కరడుగట్టిన లష్కరే తోయిబా ఉగ్రవాది షబీర్ అహ్మద్ లోన్‌ను అరెస్ట్ చేశారు. ఘాజీపూర్‌లో ఇతడిని మార్చి 29వ తేదీ రాత్రి పట్టుకున్నట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోమవారం తెలిపింది. జమ్మూకశీ్మర్‌లోని శ్రీనగర్ వాసి అయిన షబీర్ అహ్మద్ లోన్‌కు రజా, కశీ్మరీ అనే పేర్లు కూడా ఉన్నాయని వివరించింది.
పాకిస్తాన్ నిఘా విభాగం ఐఎస్‌ఐ నుంచి అందే ఆదేశాల ప్రకారం ఇతడు ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడంది. ఢిల్లీ, కోల్‌కతాల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల ప్రత్యక్షమైన దేశ వ్యతిరేక పోస్టర్ల వెనుక లోన్ హస్తముందని పోలీసు విభాగం పేర్కొంది. ఫిబ్రవరి 22వ తేదీన ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో కనిపించిన పోస్టర్ కేసులో ఇతడు వాంటెడ్‌గా ఉన్నాడని వివరించింది. పట్టుబడిన లోన్ వద్ద బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ కరెన్సీ కూడా లభ్యమైంది. సిమ్, అభ్యంతరకర సాహిత్యాన్ని స్వా«దీనం చేసుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో జరిగే ఉగ్ర కార్యకలాపాలను లోన్ సమన్వయం చేస్తున్నట్లు వీటిని బట్టి తెలుస్తోందని పోలీసు విభాగం వివరించింది.
దీర్ఘకాలంగా ఉగ్ర చర్యలతో సంబంధమున్న ఇతడు 2007లోనే అరెస్టయ్యాడు. అప్పట్లో లోన్ నుంచి ఏకే–47 రైఫిల్‌తోపాటు గ్రనేడ్‌ను స్వా«దీనం చేసుకున్నారు. రెండోసారి, 2015లో శ్రీనగర్‌లోని పరింపొర పోలీసులు అరెస్ట్ చేశారు. లోన్ పాక్ ఆక్రమిత కశీ్మర్‌లోని ముజఫరాబాద్‌లో అత్యాధునిక ఉగ్ర శిక్షణ పొందాడని ఢిల్లీ పోలీసులు వివరించారు. ఢిల్లీలో గతంలో లక్షిత హత్యలకు లోన్ ప్రణాళిక వేసినట్లు కూడా విచారణలో అంగీకరించాడని చెప్పారు. అప్పట్లో జైలు నుంచి విడుదలైన వెంటనే బంగ్లాదేశ్‌లో ఉండగానే ఐఎస్‌ఐ తరఫున పని చేసే లష్కరే తోయిబా హ్యాండ్లర్లు అబూ హుజైఫా, సుమమ బాబర్ అనే వారితో లోన్ సంబంధాలు పెట్టుకున్నాడని చెప్పారు.


