స్మృతి వనంపై ‘నిర్లక్ష్యం’ నీడ | - | Sakshi
Sakshi News home page

స్మృతి వనంపై ‘నిర్లక్ష్యం’ నీడ

Jan 3 2026 7:11 AM | Updated on Jan 3 2026 7:11 AM

స్మృత

స్మృతి వనంపై ‘నిర్లక్ష్యం’ నీడ

స్మృతి వనంపై ‘నిర్లక్ష్యం’ నీడ

గత ప్రభుత్వంలో.. బెజవాడలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు ఏడాదిన్నరగా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ఆడిటోరియంతోపాటు అసంపూర్తిగా పనులు తగ్గుతున్న పర్యాటకుల సంఖ్య

వెలవెల..

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రానికే తలమానికంగా విజయవాడలో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అంబేడ్కర్‌ స్మృతి వనంపై చంద్ర బాబు సర్కార్‌ నిర్లక్ష్యపు నీడ పడుతోంది. దీని నిర్వహణను వదిలేసి.. పెండింగ్‌ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గతంలో సందర్శకులతో కళకళలాడిన స్మృతి వనం ప్రస్తుతం వెలవెలబోతోంది. గతంలో నామమాత్రంగా ప్రభుత్వం రూ.5 టికెట్‌ ధరను నిర్ణయించింది. దీంతో నెలకు సుమారు రూ.మూడు లక్షలకు పైగా ఆదాయం వచ్చేది. ప్రస్తుతం నెలకు రూ.30 వేలు ఆదాయం కూడా రాని పరిస్థితి నెలకొంది.

నిర్వహణ ఏదీ

మొదట్లో అంబేడ్కర్‌ స్మృతి వనం నిర్వహణను విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చూసేది. చంద్ర బాబు సర్కార్‌ అధికారంలోకి రాగానే నిర్వహణను చేపట్టలేమంటూ చేతులెత్తేసింది. పైగా ఓ ప్రైవేటు సంస్థ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసుకొనేందుకు అను మతి ఇచ్చింది. ఆ ప్రాంగణంలో గ్రీనరి పూర్తిగా దెబ్బతింది. అక్కడ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్వహణ భా రం అంటూ ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించేందు కు యత్నించింది. వైఎస్సార్‌ సీపీతో పాటు, ప్రజా సంఘాల సభ్యులు ఆందోళన చేపట్టా రు. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం నిర్వహణ బాధ్యతను కల్చరల్‌ డిపార్ట్‌మెంట్‌కు అప్పజెప్పింది. కొంత మే ర ఉద్యోగులకు జీతాలు చెల్లించారు. నిర్వహణ బ కాయిలు రూ.1.5కోట్లకుపైగా ఉన్నట్లు సమాచారం. స్మృతివనం నిర్వహణతోపాటు, కొంతమేర పెండింగ్‌ పనులు చేయడానికి సాంస్కృతిక శాఖ చర్య లు తీసుకుంటున్నా నిధుల లేమి పట్టి పీడిస్తోంది.

గత ప్రభుత్వంలో ..

గత ప్రభుత్వ హయాంలో నగరానికే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచేలా అంబేడ్కర్‌ స్మృతి వనాన్ని తీర్చిదిద్దారు. మొదటి దశలో 18.18 ఎకరాల్లో దాదాపు రూ.404.35 కోట్లతో పనులు చేపట్టారు. ఆ ప్రాంగణా న్ని గ్రీనరీతో ముస్తాబు చేశారు. కారిడార్‌ మొత్తం గ్రానైట్‌ ఫుట్‌పాత్‌, ప్రాంగణంలో అందమైన మొక్కలతో ప్లాంటేషన్‌ చేశారు. ప్రత్యేక లైటింగ్‌ సిస్టం ఏర్పాటుతోపాటు అందంగా గార్డెన్‌ రూపొందించారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి అద్భుతంగా ప్రాజెక్టును రూపొందిండానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిత్యం అధికారులతో మాట్లాడుతూ పనులు పరుగులు పెట్టించారు. అరుదైన భారతరత్న బాబా సాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సామాజిక న్యాయ శిల్పం పనులు 2022 మార్చి 21న ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2024 జనవరి 19 తేదీన ఆవిష్కరించారు. నాటి ప్రభుత్వంలో జనకళతో సందడిగా కనిపించిన ఆ ప్రాంగణం చంద్రబాబు పాలనలో కళావిహీనంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం అంబ్కేడర్‌ విగ్రహం ప్రాంగణంలో ఏసీలు పని చేయడం లేదు. పైన రెండవ గ్యాలరీ పనులు ప్రారంభం కాలేదు.అంబేడ్కర్‌ విగ్రహం వెనుక రాతిని అతికించే పనులను నిలిపివేశారు. ప్రాంగణంలో ఫౌంటెన్లు పని చేయడం లేదు. 70 మంది సామర్థ్యంతో నిర్మించిన మిని థియేటర్‌ వినియోగంలోకి తీసుకు రావడం లేదు. రెండో దశలో పెండింగ్‌ పనులు ఏ ఒక్కటి పూర్తి కాలేదు. ప్రస్తుతం కేవలం 6,340 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2,000 మంది సామర్థ్యంతో నిర్మిస్తున్న కన్వెన్షన్‌ సెంటర్‌ పనులు మాత్రమే జరుగుతున్నాయి. పుడ్‌కోర్టు 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాల్సింది. ఆడిటోరియం, మ్యూజియం, లిఫ్ట్‌లు బిల్డింగ్‌ చుట్టూ నీటి కొలను, చిల్డ్రన్‌ పార్కు, మినీఽథియేటర్లు వంటి పనులు ప్రారంభమే కాలేదు.

స్మృతి వనంపై ‘నిర్లక్ష్యం’ నీడ 1
1/1

స్మృతి వనంపై ‘నిర్లక్ష్యం’ నీడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement