సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు పరిశీలించిన మంత్రి నారాయణ
తాడికొండ: రాజధానిలో వెంకటపాలెం నుంచి విజయవాడ వెళ్ళే సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ పరిశీలించారు. నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిన 1.5 కి.మీ సీడ్ యాక్సిస్ రోడ్డు పనులను పరిశీలించిన ఆయన విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు కరకట్టపై దూరం తగ్గిందన్నారు. గుంటూరు ఛానల్‌పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను పరిశీలించి ఈ నెలాఖరుకు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశాలిచ్చారు. రోడ్డు నిర్మాణం పూర్తయినందున వాహన రాకపోకలు కొనసాగుతున్నాయని ఇకపై కరకట్టపై వెళ్లే అవసరం లేకుండా ప్రయాణాలు సాగించవచ్చన్నారు. త్వరలోనే బ్రిడ్జి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు
మద్యం మత్తులో నడిరోడ్డుపై బైక్‌కు నిప్పు
కారెంపూడి: మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు బైక్‌ను నడిరోడ్డుపై తగలబెట్టిన ఘటన కారెంపూడిలో శుక్రవారం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువకుడు చిన పీర్లసావిడి వద్ద బైక్‌ను ఆపి దానికి నిప్పు పెట్టాడు. సాయంత్రం పాఠశాలలు విడిచిపెట్టే సమయం కావడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున నడిరోడ్డుపై మంటలు చెలరేగడంతో వాహనాదారులు ఇబ్బందులుపడ్డారు.
రేపు మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహావిష్కరణ
గుంటూరు మెడికల్: బీజేపీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా గుంటూరు లక్ష్మీపురం సెంటర్లో ఈనెల 4వ తేదీన ఆయన విగ్రహావిష్కరణ జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు తెలిపారు. శుక్రవారం గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విచ్చేసి వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, కూటమి నేతలు పాల్గొంటారని వెల్లడించారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిట్రా శివన్నారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ తాడువాయి రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు బజరంగ్ రామకృష్ణ, తోట శ్రీనివాస్, దేసు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు పరిశీలించిన మంత్రి నారాయణ
సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు పరిశీలించిన మంత్రి నారాయణ
సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు పరిశీలించిన మంత్రి నారాయణ


