మూగజీవాల అరణ్యరోదన | - | Sakshi
Sakshi News home page

మూగజీవాల అరణ్యరోదన

Jan 3 2026 7:11 AM | Updated on Jan 3 2026 7:11 AM

మూగజీ

మూగజీవాల అరణ్యరోదన

మూగజీవాల అరణ్యరోదన అనేక ఆస్పత్రుల్లో హైడోస్‌ యాంటీబయాటిక్స్‌, సెఫలోస్పోరిన్స్‌, లివర్‌ టానిక్‌లు, మినరల్‌ మిక్చర్‌ ప్యాకెట్లు, వాతపు పొడులు ఇలా అనేక రకాల మందులు స్టాక్‌ లేని పరిస్థితి. జ్వరాలకు, సీజనల్‌గా సంక్రమించే అనేక రకాల వ్యాధులకు సంబంధించిన మాత్రలు కూడా కొన్ని ఆస్పత్రుల్లో లేని పరిస్థితి. దీంతో సమీపంలోని ఆస్పత్రుల నుండి అరువు తెచ్చుకుని పాడిరైతులకు మందులు అందించాల్సిన దుర్గతి వైద్యాధికారులకు పట్టింది. జిల్లాలో వేల మంది పాడి పశువులను నమ్ముకుని, పాలను విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శీతాకాలం రావడంతో పశువులు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంటుంది. జబ్బున పడిన జీవాలతో పశు వైద్యశాలలకు వచ్చిన వారు, మందులు రాయించుకుని ప్రైవేట్‌ మెడికల్‌ షాపులకు వెళుతున్నారు. సాధారణంగా ప్రతి మూడు నెలలకొకసారి (క్వార్టర్లీ) ప్రభుత్వం మందులు సరఫరా చేయాల్సి ఉంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి ఇప్పటి వరకు పశువైద్యశాలలకు ఒక్కటంటే ఒక్కసారే మందులు వచ్చినట్లు తెలుస్తుంది. చివరిగా గతేడాది ఏప్రిల్‌లో మందులు సరఫరా చేశారు. నాటి నుంచి నేటి వరకు అంటే సుమారుగా తొమ్మిది నెలల నుంచి మందుల సరఫరా జరగలేదు. మందుల సరఫరా చేసే దిశగా కూడా చర్యలకు ఉపక్రమించకపోవడంతో పాడి రైతుల వేదన అరణ్యరోదనగా మిగిలిపోతుంది. వాస్తవానికి పశువుల సంఖ్య ఆధారంగా రాష్ట్ర పశు వైద్యశాఖ మందులు సరఫరా చేయాల్సి ఉంది. ప్రాంతీయ పశువైద్యశాలలకు రూ.1.25 లక్షలు, డిస్పెన్సరీలకు రూ. 75 వేలు, రూరల్‌ లైవ్‌ స్టాక్‌ యూనిట్లుకు రూ.45 వేలు చొప్పున బడ్జెట్‌ను నిర్ణయించింది. నిర్ణీత బడ్జెట్‌ ప్రకారం ఆయా ప్రాంతాల్లో పశువులు, జీవాలకు వస్తున్న వ్యాధుల ఆధారంగా బడ్జెట్‌కు లోబడి ఇండెంట్‌లను ఎంఎంఎస్‌ (మెడిసిన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టిమ్‌) ద్వారా పెట్టాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రాంతీయ పశువైద్యశాలల సంగతి ఎలా ఉన్నా.. రూరల్‌ లైవ్‌ స్టాక్‌ యూనిట్లు, డిస్పెన్సరీలకు మాత్రం తక్కువగా బడ్జెట్‌ కేటాయించడంతో.. చేసేదేమీ లేక స్థానిక వైద్యాధికారులు తక్కువ ధరలో ఎక్కువ యాంటీబయోటిక్స్‌, ఇతర మందులు, ఇంజెక్షన్లు వచ్చే మందులనే ఇండెంట్‌లుగా పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఉదాహరణకు కాల్షియం లీటరు రూ.400 నుంచి రూ.500 వరకు ఉంటుంది. ఖరీదైన హైడోస్‌ యాంటీబయాటిక్స్‌ రూ.200 నుంచి రూ.300 వరకు ఉంటుంది. ఇంత మొత్తంతో మందులు ఇండెంట్‌ పెడితే పట్టు మని నెల రోజులు కూడా స్టాక్‌ వచ్చే పరిస్థితి ఉండదు. దాంతో తక్కువ ఖర్చు ఉన్న మందులను ఇండెంట్‌ పెడుతున్నారు. పశువుల సంఖ్య ఆధారంగా బడ్జెట్‌ కేటాయించకుండా ఆస్పత్రుల వారీగా బడ్జెట్‌ కేటాయిస్తుండటంతో సరిపోని పరిస్థితి.

పశు వైద్యశాలల్లో మందుల కొరత

గతేడాది ఏప్రిల్‌ నుంచి నిలిచిన సరఫరా

పశుపోషకులపై ఆర్థిక భారం

పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

జిల్లావ్యాప్తంగా... గ్రామీణ పశు వైద్యశాలలు : 39 వెటర్నరీ డిస్పెన్సరీలు : 45 ప్రాంతీయ పశు వైద్యశాలలు : 09 పశువులు : 1,61,551 తెల్ల పశువులు : 16,171 గొర్రెలు : 1,34,398 మేకలు : 24,922 పందులు : 1,688

కోళ్లు : 32,97,896

వారంలో మందులొస్తాయి..

ఆస్పత్రులకు కావలసిన మందులకు సంబంధించిన ఇప్పటికే ఆయా వైద్యశాలల వైద్యాధికారులు ఇండెట్లు పెట్టారు. వారంలో మందులు జిల్లా స్టోర్‌కు వస్తాయి. అక్కడి నుంచి డివిజన్‌ స్టోర్‌ ద్వారా అన్ని ఆస్పత్రులకు పంపిస్తాం. ప్రాంతీయ పశు వైద్యశాలల ఏడీలు వారి పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో మందుల వినియోగాన్ని గమనిస్తూ, ఎప్పటికప్పుడు వైద్యులతో సమన్వ యం చేసుకుంటూ ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం.

–కె.వి.వి.సత్యనారాయణ,

జేడి, పశుసంవర్థకశాఖ, గుంటూరు జిల్లా

ప్రత్తిపాడు: పై రెండు ఘటనలు పశు వైద్యశాలల్లో మందు కొరతకు అద్దం పడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మూగ జీవాల ఆరోగ్యం పట్ల ఎంత అశ్రద్ధను చూపుతుందో కళ్లకు కడుతుంది. మూగజీవాల సంరక్షణను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. పశు వైద్యశాలకు నిర్ణీత సమయంలో మందులను సరఫరా చేయకుండా చోద్యం చూస్తూ మూగజీవాల ఆరోగ్యంతో ఆటలాడుతుంది. అనారోగ్యం బారిన పడి పశువులు ‘అంబా’ అని అరిచి నా ఇసు‘మాత్ర’మైనా ఆలకించే దిక్కులేకుండా పోతుంది. ఫలితంగా మందుల కోసం పశు పోషకులు ప్రైవేటు మెడికల్‌ షాపులకు చీటీలు పట్టుకుని పరుగులు పెట్టాల్సిన దుస్థితి జిల్లాలో కనిపిస్తుంది.

అనేక మందులు నిల్‌..

తొమ్మిది నెలలుగా సరఫరా చేయని మందులు

అరకొరగానే బడ్జెట్‌

మూగజీవాల అరణ్యరోదన 1
1/1

మూగజీవాల అరణ్యరోదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement