సాక్షి, తాడేపల్లి: నేడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస జగన్.. భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘మానవసేవే మాధవసేవ’ అని నమ్మి, అదే తన జీవిత పరమార్థంగా భావించి, అందరినీ ప్రేమించి, అందరికీ ప్రేమనుపంచిన దైవ స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. పేద ప్రజలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య, తాగునీరు అందించి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు. బాబా శత జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు.
‘మానవసేవే మాధవసేవ’ అని నమ్మి, అదే తన జీవిత పరమార్థంగా భావించి, అందరినీ ప్రేమించి, అందరికీ ప్రేమనుపంచిన దైవ స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. పేద ప్రజలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య, తాగునీరు అందించి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు ఆయన. నేడు భగవాన్ శ్రీ సత్యసాయి…
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 23, 2025


