సాక్షి, తాడేపల్లి: నేడు ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘ఆంగ్లేయులపై తొలి తిరుగుబాటు జెండా ఎగురవేసి.. బ్రిటీష్ వ్యతిరేక పోరాటానికి నాంది పలికిన స్వాతంత్ర్య సమరయోధుడు. మన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన ధైర్యసాహసాలు, త్యాగస్ఫూర్తి చిరస్మరణీయం. అటువంటి మహావీరుడి పేరు స్మరించుకుంటూ కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పెట్టుకోవడం మనందరికీ గర్వకారణం. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు.
ఆంగ్లేయులపై తొలి తిరుగుబాటు జెండా ఎగురవేసి, బ్రిటీష్ వ్యతిరేక పోరాటానికి నాంది పలికిన స్వాతంత్ర్య సమరయోధుడు, మన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారు. ఆయన ధైర్యసాహసాలు, త్యాగస్ఫూర్తి చిరస్మరణీయం. అటువంటి మహావీరుడి పేరు స్మరించుకుంటూ కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్… pic.twitter.com/MTjnSf0KCz
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 24, 2025


