సాక్షి, తాడేపల్లి: సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా నిలవాలని జగన్ పిలుపునిచ్చారు.
Deeply shocked to learn about the tragic accident that occurred in Saudi Arabia. I wish a speedy recovery for the injured.
My prayers are with the families of the victims in this difficult hour. May their souls rest in peace.— YS Jagan Mohan Reddy (@ysjagan) November 17, 2025
ఇక, సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంలో 42 మంది ఉమా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టి మంటలు చెలరేగడం.. అంతా గాఢ నిద్రలో ఉండడంతో సజీవ దహనం అయ్యారు. వీళ్లంతా భారత్ నుంచే అక్కడికి వెళ్లినట్లు సమాచారం. అయితే మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన యాత్రికులే అధికంగా ఉన్నారు.


