SRM వర్సిటీలో ఫుడ్‌ పాయిజన్‌తో 300మంది విద్యార్థులకు అస్వస్థత | Food Poisoning At SRM College In Amaravati | Sakshi
Sakshi News home page

SRM వర్సిటీలో ఫుడ్‌ పాయిజన్‌తో 300మంది విద్యార్థులకు అస్వస్థత

Nov 6 2025 3:52 PM | Updated on Nov 6 2025 4:57 PM

Food Poisoning At SRM College In Amaravati

సాక్షి,గుంటూరు: SRM యూనివర్సిటీలో సబ్ కలెక్టర్‌తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో యూనివర్సిటీ క్యాంటిన్‌లో ఆహారం నాసిరకంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెనాలి సబ్‌ కలెక్టర్‌ సంజనా సిన్హా తెలిపారు.

ఈ సందర్భంగా తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మాట్లాడుతూ.. SRM యూనివర్సిటీలో దాదాపు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల నుంచి సుమారు రోజుకి 50 మంది అస్వస్థకు గురి అవుతున్నారు

వాంతులు, విరోచనాలు, డయేరియాతో బాధపడుతున్నారు. ఎక్కువమంది కలుషిత ఆహారం తినడం వల్ల తమ అస్వస్థకు గురయ్యామని చెప్తున్నారు. ఇప్పటికే యూనివర్సిటీలో క్యాంటీన్ పరిశీలించాం. ఫుడ్ శాంపిల్స్ ,వాటర్ శాంపిల్స్ సేకరించాం. ఇద్దరు విద్యార్థులు ఎన్నారై హాస్పటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

SRM University : 300 మందికి అస్వస్థత
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement