సాక్షి, తాడేపల్లి: నేడు సీపీ బ్రౌన్ జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. సీపీ బ్రౌన్‌కు నివాళి అర్పించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘తెలుగు భాషను ప్రేమించి, తెలుగు సాహిత్యాన్ని ముద్రించి భద్రపరచి, ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు సీపీ బ్రౌన్. ఆయన సమకూర్చిన తెలుగు–ఇంగ్లీష్ నిఘంటువు తెలుగు భాష అభివృద్ధికి శాశ్వతమైన పునాది వేసింది. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు.
తెలుగు భాషను ప్రేమించి, తెలుగు సాహిత్యాన్ని ముద్రించి భద్రపరచి, ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు సి.పి. బ్రౌన్ గారు. ఆయన సమకూర్చిన తెలుగు–ఇంగ్లీష్ నిఘంటువు తెలుగు భాష అభివృద్ధికి శాశ్వతమైన పునాది వేసింది. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/8kBc2udUnO
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 10, 2025


