
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ సంక్షేమ బాలుర హాస్టల్‌లో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే వారిని పెదనందిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అవుతున్నట్టు తెలిసింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
